సిమెంట్ ఇల్లు కాదు..ప్లాస్టిక్ ఇల్లు

Update: 2019-11-27 13:47 GMT

ఇల్లు కట్టాలంటే సాధారణంగా అందరూ ఇటుకలు, ఇసుక, సిమెంట్ వాడతారు. కానీ ఒక సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణ సమస్యను పారదోలుతూ అందరూ పాడేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఇంటిని కడుతుంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఇంటిని ఏ విధంగా నిర్మిస్తారో, నిర్మాణానికి ఏం ఏం ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

హైదరాబాద్ నగరానికి చెందిన బాంబూ హౌస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఉపయోగిస్తూ ఇళ్లను, ఫుట్ పాత్‌లను నిర్మిస్తుంది. ఈ సంస్థ సభ్యలు చేసిన ఈ ప్రయత్నం ద్వారా భవిష్యత్తులో సిమెంట్, ఇటుకలతో కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మితమయ్యే ఇళ్లే కనిపిస్తాయేమో అనుకుంటున్నారు స్థానికులు.

ఈ ప్లాస్టిక్ ఇంటిని నిర్మించాలంటే రెండున్నర టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అవసరం అవుతుంది. ఇంటి పైకప్పునకు యాభై లక్షల ప్లాస్టిక్ బ్యాగులు అవసరమవుతాయి. ఈ ప్లాస్టి్క్ వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేసి ఇంటి నిర్మనానికి ఉపయోగిస్తారు.

ఈ ఇంటిని నిర్మించడమే కాదు ఈ ఇంట్లో పార్కింగ్ అటెండెంట్ ఇంద్రనీల్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయన ఆ ఇంటి గురించి తెలిపిన వివరాల్లో్కెళితే మూడు నెలల నుంచి అతను ఆ ఇంట్లోనే ఉంటున్నానని తెలిపారు. సిమెంటుతో నిర్మించిన ఇండ్లలో ఉన్న సదుపాయాలలాగానే ఈ ఇంట్లో కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

అయితే ఏడాది క్రితమే ఈ ఇళ్లను నిర్మించే ఆలోచనతో బాంబూ హౌస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ లింగం ముందుకు వచ్చారు. ఈ ఇళ్లను నిర్మించడం వలన ప్లాస్టిక్ వ్యర్ధాలను నిర్మూలించడంతోపాటు, ప్లాస్టిక్ కవర్‌లు, వస్తువులు సేకరించే వారికి కూడా ఉపాధి కల్పించొచ్చని ఆయన తెలిపారు.



Tags:    

Similar News