CLP Meeting: నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
CLP Meeting: రాత్రి 7 గంటలకు రేవంత్ అధ్యక్షతన సమావేశం
CLP Meeting: నేడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంకానుంది. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీకానున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. రాజ్యసభ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికలు, రుణమాఫీ, రైతు భరోసా, సచివాలయం దగ్గర రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై కీలకంగా చర్చించనున్నారు. ఇక వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై చర్చిస్తారు. రేపటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నారు.