Harish Rao: రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Harish Rao: ఆగస్ట్ 15లోపు వందశాతం రుణాలు.. మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ మాట నిలబెట్టుకోలేదు
Harish Rao: రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. ఆగస్ట్ 15లోపు వందశాతం రుణాలు మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.. మాట నిలబెట్టుకోలేదన్నారు. ఇది పాక్షిక రుణమాఫీ మాత్రమే అని హరీష్ అభిప్రాయపడ్డారు. కేబినెట్‌లో చెప్పిందేమో 31వేల కోట్లు అయితే ఇప్పుడు ఇచ్చిందేమో 17వేల కోట్లు అన్నారు. ఇంకా లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ రాలేదన్నారు. వంద శాతం అమలు చేసే వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదన్నారు హరీష్ రావు.