Revanth Reddy: ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే..
Revanth Reddy: కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Revanth Reddy: కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చన్నారు. కలెక్టర్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు ఉండాలని కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ.. ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో పేర్కొన్నారు.