Veterinary Colleges: నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు- సీఎం కేసీఆర్
Veterinary Colleges in Telangana: రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Veterinary Colleges in Telangana: రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిద్ధిపేట, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ లో కొత్త వెటర్నరీ కాలేజీలు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిద్దిపేట తెలంగాణ నడిగడ్డ అని తెలిపారు.
తెలంగాణలో గతంలో మంచినీటికి చాలా ఇబ్బందులు పడ్డామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చుక్క నీటి బొట్టు కోసం హరిగోస పడ్డామని గుర్తు చేశారు. స్వరాష్ట్రం వచ్చాక మే నెలలో మండుటెండలోనూ చెరువులు అలుగులు పారుతున్నాయన్నారు. పల్లెప్రగతి వెనుక పరమార్థం ఉందని సీఎం అన్నారు. పరిపాలన, సంస్కరణలో భాగంగా జిల్లాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు సీఎం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ బాధలు వర్ణాణతీతంగా ఉండేవన్నారు. ఒక్క సబ్‌స్టేషన్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు.
తాను పుట్టిన గడ్డలోనే తొలి కార్యాలయం ప్రారంభించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుంచే ప్రారంభమైందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం వరి విపరీతంగా పండుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉందన్నారు. దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి అభివృద్ధినే తెలంగాణ కోరుకుంటుదని వెల్లడించారు. ఎరువుల బస్తాలను పోలీస్ స్టేషన్‌లలో అమ్మే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.