Pune: పుణేలో చాందినీ చౌక్ బ్రిడ్జి కూల్చివేతకు రెడీ
Pune: తెల్లవారుజామున 2 గంటలకు కూలననున్న బ్రిడ్జి
Pune: మహారాష్ట్రలోని పుణే చాందినీ చౌక్‌లోని పాత వంతెన కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి కూల్చివేతపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా ట్విన్ టవర్లను కూల్చేసిన ముంబై సంస్థ ఎడిఫైసే.. చాందినీ చౌక్‌లోని వంతెనను కూల్చివేయనున్నది. ముంబై-బెంగళూరు జాతీయ రహదారిపై పుణేలో ఉన్న ఈ వంతెన అత్యంత కీలకమైనది. అయితే ఇది బ్రిటీష్ కాలంలో అప్పటి అవసరాల మేరకు దీన్ని నిర్మించారు. అయితే.. జాతీయ రహదారి విస్తరించినప్పటికీ.. బ్రిడ్జిని మాత్రం వెడల్పు చేయలేదు. ఈ బ్రిడ్జి సమీపంలో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చాందినీ చౌక్ బ్రిడ్జిని కూల్చేయాలని నిర్ణయించింది. దాని స్థానంలో మల్టీ బ్రిడ్జి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే సాంకేతిక సమస్యలు, వాతావరణ పరిస్థితుల కారణంగా బ్రిడ్జి కూలచివేత ప్రక్రియ ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ బ్రిడ్జిని 2న తెల్లవారుజామున కూల్చేయాలని ఎడిఫైస్ సంస్థ నిర్ణయించింది.
చాందినీ చౌక్ బ్రిడ్జి కూల్చివేతలను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్వయంగా పర్యవేక్సించనున్నారు. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతల్లో ఉపయోగించిన దానికంటే.. మరింత మెరుగైన జెలటిన్ పదార్థాలతో చాందినీ చౌక్ బ్రిడ్జిని వాటర్ ఫాల్ టెక్నిక్‌తో కూల్చేయనున్నట్టు ఎడిఫైస్ సంస్థ సహ యజమాని చిరాగ్ ఛెడ్డా తెలిపారు. ఈ బ్రిడ్జికి మొత్తం 1300 రంద్రాలు చేసి... 600 కిలోల పేలుడు పర్థాలను నింపినట్టు వెల్లడించారు. కూల్చివేతల ప్రక్రియలో 350 మంది సభ్యులు పాల్గొంటారని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ సంజయ్ కదమ్ తెలిపారు. ఈ పేలుడు ప్రక్రియ నిర్వహించేందుకు 8 గంటల పాటు రాకపోకలను నిలిపేస్తున్నారు. ఇప్పటికే వాహనాలను సతారా నుంచి ముంబైక్, పూణె నగరాలకు వెళ్లేలా ట్రాఫిక్‌ను మళ్లించారు.