Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. గవర్నర్ గా కేసీఆర్ , కేంద్ర మంత్రి గా కేటీఆర్
రైతు రుణమాఫీకి 5 వేల కోట్ల రిజర్వ్ నిధులు ఉంచామన్న సీఎం రుణమాఫీ కాని వారు కలెక్టరేట్‌కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వొచ్చని సూచించారు.
Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్నారు. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్‌రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు. బీఆర్ఎస్‌కు ప్రస్తుతం నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. వారి విలీనంతో కవితకు రాజ్యసభ ఇస్తారన్నారు. ఇక నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవి ఇవ్వనున్నట్లు చెప్పారాయన.
బీఆర్ఎస్ బీజేపీలో విలీనాన్ని ఒకవేళ ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగకమానదన్నారు. ఇక రైతు రుణమాఫీకి 5 వేల కోట్ల రిజర్వ్ నిధులు ఉంచామన్న సీఎం రుణమాఫీ కాని వారు కలెక్టరేట్‌కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వొచ్చని సూచించారు. తన మార్క్ ఉండాలనే ఆగస్టు 15 వరకు రుణమాఫీ తేదీ ప్రకటించానన్నారు.
హస్తినలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఫాక్స్‌కాన్-యాపిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీకానున్నారు. హైకమాండ్ పెద్దలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించనున్నారు.