కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నబీఆర్ఎస్
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతు ధర్నాలు చేస్తున్నారు. రైతు ధర్నాలోబిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీమంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ఎంపీలు ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాల్లో జరిగే రైతు ధర్నాలో పాల్గొంటున్నారు.
రైతు రుణమాఫీని సంపూర్ణంగా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతు రుణమాఫీ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ అన్నారు. ఇక రైతులపై తలమడుగు,బజార్ హత్నూర్ మండలంలో రైతులపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశారని అన్నారు..డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కల ప్రకారం రుణమాఫీ ఒట్టిదే అని అన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ 40 శాతం సైతం పూర్తి కాలేదని అన్నారు.సీఎం ఎమ్మెల్యేగా ఉన్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో 20,239 రైతుల ఖాతాలు ఉంటే 8,527 మందికి మాత్రమే రుణమాఫీ అయిందని కేటీఆర్ అన్నారు.
ఇక మాజీమంత్రి హరీష్ రావు ఆలేరు నియోజకవర్గంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. అంతకు ముందు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామినిదర్శించుకోకున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ సంపూర్ణంగారుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని హరీష్ రావు ఆరోపించారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి మాట తప్పినందుకు పాపపరిహారం కోసం తెలంగాణ ప్రజల కోసం యాదాద్రి దేవాలయంలోతాను పూజలు చేస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు.