BRS Avirbhava Sabha: ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్‌ ఆవిర్భావ సభ

BRS Avirbhava Sabha: రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రికి నలుగురు సీఎంలు

Update: 2023-01-18 03:42 GMT

BRS Avirbhava Sabha: ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్‌ ఆవిర్భావ సభ

BRS Avirbhava Sabha: ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్‌ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ హాజరుకానున్నారు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాసేపట్లో ఈ నేతలంతా ప్రగతిభవన్‌కు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు నలుగురు సీఎంలు, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ చేరుకుంటారు. అక్కడినుంచి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రికి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 11 గంటల 40 నిమిషాలకు యాదాద్రి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు ఖమ్మం కలెక్టరేట్‌ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు వెంకటాయపాలెం సభా ప్రాంగణానికి సీఎం కేసీఆర్‌, మిగతా ముఖ్యమంత్రులు, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ చేరుకుంటారు. బీఆర్ఎస్‌ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించిన తర్వాత వీళ్లంతా మాట్లాడతారు. ఇక ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ సభకు అన్ని ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. 100 ఎకరాల్లో జరగనున్న ఈ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News