రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించిన బొంతు రామ్మోహన్
*కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. దిష్టిబొమ్మ దగ్ధం చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
Hyderabad: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ ఉప్పల్‌లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఐదేళ్ల నుంచి రేవంత్ రెడ్డి కనిపించకుండా పోయి మల్కాజ్‌గిరి ప్రజలను మోసం చేశారని బొంతు రామ్మోహన్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.