BJP: పార్లమెంట్ ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ పూర్తిచేసుకున్న బీజేపీ

BJP: నియోజకవర్గాల వారీగా లిస్ట్ సమర్పించిన రాష్ట్ర నాయకత్వం

Update: 2024-02-28 15:00 GMT

BJP: పార్లమెంట్ ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ పూర్తిచేసుకున్న బీజేపీ

BJP: పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ గ్రౌండ్ వర్క్ దాదాపు పూర్తయింది. ఈ క్రమంలోనే రేపు ఢిల్లీలో ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి బీజేపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో అధిక స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు చేస్తోంది. కాగా ఈ భేటీలోనే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కనీసం 10 మంది అభ్యర్థులను మొదటి లిస్టుగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆశావహుల జాబితాలను రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వానికి అందజేసింది.

కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, నాగర్‌కర్నూల్ నుంచి రాములు లేదా ఆయన కుమారుడు భరత్‌కు అవకాశం ఇవ్వనుంది బీజేపీ. ఇక మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, శాంతి కుమార్, జితేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.

జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి ఆలె భాస్కర్, ఆకుల విజయ, బద్దం మహిపాల్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, వీరేందర్‌గౌడ్, చాడ సురేష్‌రెడ్డి, మాల్క కొమురయ్య హరీష్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఖమ్మం నుంచి రమేష్, వినోద్‌రావు, డాక్టర్ వెంకటేశ్వర్ల పేర్లను పరిశీలిస్తోంది అధిష్టానం.

ఇటు భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్, మనోహర్‌రెడ్డి, రాణీ రుద్రమ పోటీలో ఉన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి జితేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కృష్ణప్రసాద్, కడియం కల్యాణ్, చింతా సాంబమూర్తి టికెట్ ఆశిస్తున్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి రామచంద్రుడు నాయక్, సోలంకి శ్రీనివాస్, హుస్సేన్ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి యమునా పఠక్, మాధవీలత, పొన్న వెంకటరమణ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. మెదక్ నుంచి రఘునందన్‌రావు, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.

పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎస్.కుమార్, ఆరెపల్లి మోహన్ సహా ఇతర స్థానిక నేతలు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితే పాటు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో చేరికలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. అయితే బీజేపీలో చేరితే వారికే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News