SC Classification: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ నియామకం

SC Classification: ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ

Update: 2024-09-12 14:06 GMT

SC Classification: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ నియామకం

SC Classification: ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కో-ఛైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

Tags:    

Similar News