Rythu Bandhu: 5 ఎకరాల వరకే రైతుబంధు..!

Rythu Bandhu: రైతులకు పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం.. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2023-01-11 05:49 GMT

Rythu Bandhu: 5 ఎకరాల వరకే రైతుబంధు..!

Rythu Bandhu: రైతులకు పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం.. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. అయితే రైతుబంధు పథకాన్ని పెద్ద రైతులకు కాకుండా, కేవలం ఐదెకరాల వరకు భూములున్న రైతులకు మాత్రమే అమలు చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా కట్టంగూరు వ్యవసాయ విస్తర ణాధికారి (ఏఈవో) కల్లేపల్లి పరశురాములు ఏకంగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అలా మిగిలిన సొమ్మును రైతులు పొలాలకు, చేన్లకు వెళ్లే డొంకలు, బండ్ల బాటల అభివృద్ధికి కేటాయించాలని సీఎంకు విన్నవించారు. నగరాలుగా అభివృద్ధి చెందిన గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ భూములకు, పంటలు పండించనటువంటి భూములకు రైతుబంధు ద్వారా వచ్చే డబ్బులు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేఖను మంగళవారం తపాలా ద్వారా ప్రగతిభవన్‌ చిరునామాకు పంపారు.

Tags:    

Similar News