KTR: తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది
KTR: కాకతీయ కళాతోరణంపై వ్యాఖ్యలు చేసిన రైవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం
KTR: తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమర్శించారు. కాకతీయ కళాతోరణంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, గంగా-జమునా తెహజీబ్‌కి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడనట అని కేటీఆర్ మండిపడ్డారు. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి కాకతీయుల గురించి ప్రస్తుతించాలన్నారు. ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా..? అని కేటీఆర్ నిలదీశారు.