Nagarkurnool: వైద్యం వికటించి మహిళ మృతి.. ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన మృతురాలి బంధువులు

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళన

Update: 2023-08-23 05:22 GMT

Nagarkurnool: వైద్యం వికటించి మహిళ మృతి.. ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన మృతురాలి బంధువులు

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతిచెందింది. దీంతో ఆగ్రహంతో మృతురాలి బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి.. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అచ్చంపేట మండలం దర్శన్‌గడ్డ తండాకు చెందిన గర్బిణీ ఈనెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కోసం వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు గైనకాలజిస్టు,... గర్బిణీకి ఆపరేషన్ చేసి డెలివరీ చేశాడు.

అయితే వారం రోజుల తర్వాత మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో.. వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు. అయితే సదరు వైద్యుడు ఈసారి తన ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చుకొని మరోసారి ఆపరేషన్ చేశారు. అయినా రక్తస్రావం ఆగకపోవడంతో హైదరాబాద్ వెళ్లాల్సిందిగా సూచించారు. మహిళా బంధువులు ఆమెను హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో రోగి బంధువులు ఆస్పత్రి పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

Tags:    

Similar News