Reels On WhatsApp: చాలా మంది మొబైల్ యూజర్స్ ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో రీల్స్‌ను చూడటం అనేది జరుగుతుంటుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ని చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మధ్యమధ్యలో వాట్సాప్ మెసేజెస్ వస్తుంటాయి. అటువంటప్పుడు ఆ వాట్సాప్ మెసేజ్ చెక్ చేయడం కోసం ఇన్‌స్టాగ్రామ్ లోంచి బయటకు రావడం, ఆ తరువాత మళ్లీ రీల్స్ చూడటం కోసం తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లాల్సి రావడం జరుగుతుంది. ఇది ఎవరికైనా సరై కొంత చికాకు కలిగిస్తుంది. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను నేరుగా వాట్సాప్‌లోనూ చూడవచ్చు. సోషల్ మీడియా యాప్స్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని మెటా వాట్సాప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను చూసేలా కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది.
వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను చూడటం చాలా సులభం. అయితే ప్రస్తుతానికి ప్రారంభదశలో చాలా తక్కువ రీల్స్ మాత్రమే మీరు వాట్సాప్‌లో చూసే అవకాశం ఉంది. అయితే రాబోయే కాలంలో Meta ఈ ఫీచర్‌ని మారుస్తుంది. త్వరలోనే ఎక్కువ రీల్స్ చూసే ఫీచర్‌ని తీసుకొస్తుందని తెలుస్తోంది. వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఎలా చూడాలి?
1. ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
2. ఇప్పుడు WhatsApp హోమ్ స్క్రీన్‌లో Meta AI సింబల్‌పై క్లిక్ చేయండి
3.Meta AI గుర్తుపై క్లిక్ చేసిన తర్వాత చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
4. ఈ చాట్ బాక్స్ కింద, ఒక టెక్స్ట్ ఇన్‌పుట్ బాక్స్ కనిపిస్తుంది.
5. ఇది సాధారణ చాట్ ఇంటర్‌ఫేస్ తరహాలో ఉంటుంది.
6. ఇప్పుడు ఈ చాట్ బాక్స్‌లో ‘షో మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్’ అని టైప్ చేయండి.
7. మీరు సెండ్‌పై క్లిక్ చేసిన వెంటనే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కొన్ని సెకన్లలో మీ స్క్రీన్‌పై కనిపించడం ప్రారంభిస్తాయి.
8. ఇప్పుడు మీరు రీల్స్‌పై క్లిక్ చేయవచ్చు. మీరు రీల్స్‌పై క్లిక్ చేసిన వెంటనే అది మిమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌కి తీసుకెళుతుంది.
మీరు వాట్సాప్‌లో నిర్దిష్ట పేజీ లేదా ఒక వ్యక్తికి సంబంధించిన రీల్స్‌ను చూడాలనుకుంటే, Meta AI ఆ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. దీని కోసం చాట్ బాక్స్‌లో షో మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో పాటు ఆ వ్యక్తి పేరును టైప్ చేయండి. అప్పుడు ఆ వ్యక్తి రీల్స్ మీ వాట్సాప్‌లో కనిపించడం ప్రారంభిస్తాయి.