Xiaomi 15: షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు సూపర్‌గా ఉన్నాయ్!

Xiaomi 15: షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. Xiaomi 15 సిరీస్‌ను కంపెనీ చైనాలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Update: 2024-10-18 11:14 GMT

Xiaomi 15: షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు సూపర్‌గా ఉన్నాయ్!

Xiaomi 15: షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.  Xiaomi 15 సిరీస్‌ను కంపెనీ చైనాలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు ఉంటాయి. Xiaomi 15, Xiaomi 15 Pro, Xiaomi 15 Ultra. ఇప్పుడు వనిల్లా మోడల్ అంటే షియోమీ 15కి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యీయి.

లీకులు ప్రకారం.. ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రావచ్చని తెలుస్తుంది. ఇది కాకుండా ఫోన్ 120Hz AMOLED డిస్‌ప్లే, లైకా ట్యూన్డ్ కెమెరా సిస్టమ్‌తో కూడా వస్తుందని సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌లోని సమచారం ప్రకారం ఈ ఫోన్ ఫోటోగ్రఫీ కోసం లైకా టెక్నాలజీతో ట్యూన్ చేయబడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. ఇందులో ఓమ్నివిజన్ OV50H సెన్సార్‌తో కూడిన 50మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ 3.2x టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

అలానే షియోమి 15 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉండవచ్చు. ఇది వచ్చే వారం హవాయిలో జరిగే స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో ప్రదర్శించవచ్చని భావిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అయిన Android 15 ఆధారంగా HyperOS 2.0లో రన్ అవుతుంది.

90W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5500mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంటుంది. ఫోన్ వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది. వాటర్, డస్ట్ నుండి ప్రొటక్ట్ చేయడానికి IP68 రేటింగ్‌తో వస్తుంది.

ఫోన్ 16GB వరకు RAM + 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండవచ్చని మునుపటి లీక్‌లు సూచిస్తున్నాయి. ఇది బ్లాక్, వైట్ కలర్ ఎంపికలలో రావచ్చు. ఫోన్‌ను గ్లాస్ లేదా వేగన్ లెదర్ ఫినిషింగ్‌లో కూడా అందించవచ్చు.

ఇటీవలి నివేదిక ప్రకారం చైనాలో Xiaomi 15 ధర బేస్ 12GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్ కోసం CNY 4599 (సుమారు రూ. 52,000) నుండి ప్రారంభమవుతుంది. అయితే టాప్-ఎండ్ 1TB వేరియంట్ ధర CNY 5499 (సుమారు రూ. 63,000)గా ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News