WhatsApp Trick: మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడాలో మీరే నిర్ణయించవచ్చు ఎలాగంటే?

Update: 2021-08-28 07:17 GMT

WhatsApp Trick: మెసేజింగ్ యాప్ WhatsApp ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్. ఈ యాప్ ప్రజాదరణ పొందింది. ఎందుకంటే, ఇది వినియోగదారుల ప్రతి సౌలభ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ యాప్‌లో కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇప్పుడు WhatsApp మీ విచక్షణతో మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూస్తారు అనే సరికొత్త ఫీచర్ అందిస్తోంది. ఇది మీ ప్రొఫైల్ ఫోటో గోప్యతను కాపాడుతుంది.

చాలా మంది వ్యక్తులు మీ ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అ విషయం మీకు కూడా తెలియదు. గోప్యత పరంగా ఇది సరైనది కాదు. ఆ సందర్భంలో, మీ WhatsApp ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడొచ్చు అనేది ఇకపై మీరే నిర్ణయించవచ్చు. దీనిద్వారా మీరు కావాలనుకునే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మొదలైన వారు మాత్రమే మీ ప్రొఫైల్ ఫోటోను చూడగలరు. దీన్ని ఎలా సెట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp లో ప్రొఫైల్ ఫోటోలను ఎలా దాచాలి?

ప్రొఫైల్ ఫోటో దాచడానికి ముందు WhatsApp తెరవండి.

అప్పుడు WhatsApp సెట్టింగ్‌లకు వెళ్లండి.

ఇప్పుడు ఖాతాకు వెళ్లి గోప్యతను నొక్కండి.

అప్పుడు, ప్రొఫైల్ పిక్చర్ పై నొక్కండి.

WhatsApp లో డిఫాల్ట్ సెట్టింగ్‌లలో, మీ ప్రొఫైల్ ఫోటో ప్రతిఒక్కరూ చూడవచ్చు.

మీరు మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులకు మాత్రమే మీ ప్రొఫైల్ పిక్చర్‌ను చూపించాలనుకుంటే, సెట్టింగ్‌లకు వెళ్లి , 'అందరికీ' బదులుగా 'నా కాంటాక్ట్' క్లిక్ చేయండి.

మీ ప్రొఫైల్ ఫోటోను అసలు ఎవ్వరూ చూడకూడదనుకుంటే, మీరు ఎవరూ ఎంచుకోవాలి. ఇది మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరూ చూడకుండా నిరోధిస్తుంది.

Tags:    

Similar News