WhatsApp Latest Update: స్కాన్ చేయకుండానే 4 డివైజ్‌ల్లో వాట్సప్ లాగిన్!
WhatsApp Latest Update 2021: వాట్సాప్ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
WhatsApp Latest Update 2021: వాట్సాప్ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా ఒకేసారి 4 డివైజ్‌లలో లాగిన్ అయ్యేలా ఈ ఫీచర్ త్వరలో రానున్నట్లు కంపెనీ సీఈవో విల్ క్యాథ్‌కార్ట్ స్పష్టం చేశారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. యూజర్ల సౌలభ్యం కోసం మేం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. సరికొత్త ఫీచర్లను అందించేందుకు ప్రయత్నిస్తుంటాం. తాజాగా ఒకేసారి 4 డివైజ్‌లలో లాగిన్ అయ్యేలా సరికొత్త ఆఫ్షన్‌పై పనిచేస్తున్నాం. ఈ ఫీచర్‌తో ఐప్యాడ్‌లోనూ ఇక వాట్సాప్ లాగిన్ కావొచ్చని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ లో లాగిన్ అయ్యేందుకు స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేయాల్సిందే. అయితే ఈ సరికొత్త ఫీచర్‌తో మెయిన్ యాప్, స్మార్ట్ ఫోన్ యాప్ సపోర్ట్ లేకుండా మల్టీ డివైజ్ ఫీచర్ తో లాగిన్ కావొచ్చని తెలుస్తోంది.
ఇదే విషయంపై ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఓ ప్రకటన విడుదల చేశాడు. ప్రైవసీ సమస్యలున్నప్పటికీ ఈ సరికొత్త ఫీచర్‌ను ఓ టెక్నికల్ ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ఫోన్ స్విచ్ఛాప్ అయినా.. మల్టీ డివైజ్ లాగిన్ తో వాట్సాప్ పని చేసేలా డిజైన్ చేయబోతున్నామని తెలిపాడు. దీంతోపాటు 'వ్యూ వన్స్' ఫీచర్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే అవతలి యూజర్ ఒకసారి ఫొటో, వీడియో చూడగానే దానంతట డిలీట్ అయ్యే ఫీచర్ అన్నమాట. ముందుముందు వాట్సప్‌లో మరిన్ని అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.