Whatsapp New Feature: వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే సోషల్ మీడియా మెసేజింగ్ అప్లికేషన్.. కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారుల అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సప్ తాజాగా మరొక కొత్త ఫీచర్ తో మన ముందుకు వచ్చింది. "వ్యూ వన్స్" అనే కొత్త ఫీచర్ ని తాజాగా వాట్సప్ వినియోగదారునికి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ తో ఇక మనం అవతలి వ్యక్తికి ఫోటోని పంపినపుడు ఆ వ్యక్తి ఆ ఫోటోని ఒకసారి మాత్రమే చూడగలడు. ఆ తర్వాత ఆ ఫోటోని ఓపెన్ చేయాలన్న ఓపెఎన్డ్ అని ఆ ఫోటో రెండోసారి కనిపించదు. ఈ ఫీచర్ వల్ల వినియోగదారునికి ఫోటోల విషయంలో కొంతవరకు సెక్యూర్ గా ప్రైవసీ ఉన్న కొన్ని సందర్భాలలో ఈ ఫీచర్ వల్ల ఇబ్బందిపడవచ్చు.
అయితే ఫోటోలు అత్యవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇక ఇప్పటికే ఈ ఫీచర్ ని ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్ లలో వినియోగంలో ఉంది. ఇక అదేవిధంగా వీడియోని పంపినపుడు కూడా "వ్యూ వన్స్" ఆప్షన్ తో అవతలి వ్యక్తికి పంపడంతో వీడియోని కూడా ఒకేసారి చూసిన తరువాత ఆ వీడియోకి మరొకసారి ఓపెన్ అవదు. ఈ ఫీచర్ వల్ల వినియోగదారునికి వీలైనంత ప్రైవసీ అందించడమే కాకుండా వివిధ రకాలైన ఫోటోలు వీడియోల వల్ల ఫోన్ స్టోరేజ్ ని కూడా ఫుల్ అవకుండా ఉపయోగపడుతుందని వాట్సప్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.