WhatsApp: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
WhatsApp: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
WhatsApp: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్‌లో ఒకరికి మెస్సేజ్ పంపిన తర్వాత, సాధారణంగా గంటవరకు దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉంది. అయితే ఆ ఆప్షన్‌ను మరింత డెవలప్ చేశారు. ఇకపై పంపిన మెసేజ్ ను రెండు రోజుల వరకు తొలగించుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. దీంతోపాటు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని అధికారాలు లభించనున్నాయి. గ్రూపులోని ప్రతి ఒక్కరి ఫోన్లో మెస్సేజ్‌లు డిలీట్ అయ్యే ఆప్షన్ అడ్మిన్లకు ఉంటుంది. ఫేక్ సమాచారం ఎక్కువగా వ్యాప్తి అవుతున్న దృష్ట్యా అడ్మిన్లకు ఈ అధికారాలు సమకూర్చాలని వాట్సాప్ నిర్ణయించింది. అయితే ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది.