Laptops Notebooks: ల్యాప్‌టాప్, నోట్‌బుక్‌ల మధ్య తేడాలు.. ప్రయోజనాలు అప్రయోజనాలు..!
Laptops Notebooks: ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరగడం వల్ల ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడకం విపరీతంగా పెరిగింది.
Laptops Notebooks: ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరగడం వల్ల ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడకం విపరీతంగా పెరిగింది. చాలామంది ల్యాప్‌టాప్, నోట్‌బుక్‌ల ద్వారా వర్క్ చేస్తున్నారు. ఇవి రవాణా చేయడానికి వీలుగా ఉంటాయి. కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లి పనిచేయవచ్చు. అయితే చాలామందిలో ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలా లేదంటే నోట్‌బుక్ కొనాలా అనే ప్రశ్న మెదులుతుంది. వాస్తవానికి రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. స్పెసిఫికేషన్‌లలో వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఈ రోజు తెలుసుకుందాం.
ప్రాసెసింగ్ వేగం
సాధారణంగా నోట్‌బుక్‌లలో ఉపయోగించే ప్రాసెసర్ వేగం ల్యాప్‌టాప్‌ల కంటే తక్కువగా ఉంటుంది. నోట్‌బుక్‌లలో గేమింగ్, మల్టీ టాస్కింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ల్యాప్‌టాప్‌లలో ఇలాంటి సమస్యలు అరుదుగా కనిపిస్తాయి.
బరువు
నోట్‌బుక్‌ల బరువు ల్యాప్‌టాప్‌ల కంటే తక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయంలో నోట్‌బుక్‌లను తీసుకెళ్లడం సులభం అవుతుంది. ల్యాప్‌టాప్‌లను తీసుకెళ్లడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి నోట్‌బుక్‌ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి.
డిజైన్
డిజైన్ పరంగా నోట్‌బుక్‌లు అద్భుతమైన లుక్‌ని కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ల్యాప్‌టాప్‌లు కొంచెం భారీగా ఉంటాయి ఒక పెద్ద వస్తువులా కనిపిస్తాయి.
ఎడిటింగ్
వీడియో లేదా ఫోటో ఎడిటింగ్ చేయాలంటే ల్యాప్‌టాప్‌లు చాలా మెరుగని చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో నోట్‌బుక్‌లు వెనుకబడి ఉంటాయి. వీటిపై ప్రో లెవెల్ ఎడిటింగ్ చేయలేరు. ఎందుకంటే వాటి ప్రాసెసింగ్ వేగం తక్కువగా ఉంటుంది.
ధర
ఈరోజుల్లో నోట్‌బుక్‌లు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. 15 వేల నుంచి 25 వేల వరకు కొనుగోలు చేయవచ్చు. ల్యాప్‌టాప్‌లు అయితే 30 వేల నుంచి 40 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.