Vivo X200 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దాని తాజా స్మార్ట్‌ఫోన్ సిరీస్ X200 గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కంపెనీ త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో మూడు మోడల్స్ ఉన్నాయి. అందులో మొదటిది X200 మోడల్ కాగా రెండోది X200 Pro. X200 Pro మినీ మూడో మోడల్.
ఇంతలో వివో ఈ నెలాఖరులో భారతదేశంలో ఈ సరికొత్త ఫోన్‌లను విడుదల చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే కొన్ని లీక్స్‌లో ఈ ఫోన్ నవంబర్ 22న లాంచ్ కావచ్చని సూచిస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం
Vivo X200 సిరీస్ ఫీచర్స్
వివో ప్రో వేరియంట్ కొంచెం పెద్ద 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే స్పెసిఫికేషన్‌లతో, కానీ స్క్రీన్ కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఉంటుంది. రెండు మోడల్స్ శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తాయి. LPDDR5x RAM, UFS 4.0 స్టోరేజ్‌తో ఉంటాయి. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. X200 శక్తివంతమైన 5,800mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రో మోడల్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది.
రెండు మోడల్స్ 90W వైర్డు ఛార్జింగ్‌ను కలిగి ఉన్నాయి. అయితే ప్రో వెర్షన్‌లో 30W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంది. కెమెరాల విషయానికొస్తే, రెండు ఫోన్‌లు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నాయి. స్టాండర్డ్ లెన్స్ ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ ఒకే 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.