Twitter: ట్విటర్ కొత్త పాలసీ.. ఇకపై అలా చేస్తే కుదరదు
Twitter New Rules 2021: సోషల్ బ్లాగింగ్ దిగ్గజం ట్విటర్ ఇకపై ప్రైవసీ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది.
Twitter New Rules 2021: సోషల్ బ్లాగింగ్ దిగ్గజం ట్విటర్ ఇకపై ప్రైవసీ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోనుంది. ఈ కొత్త అప్‌డేట్ గురించి ట్విట్టర్ తన బ్లాగ్ పోస్ట్‌లో వివరిస్తూ.. ట్విట్టర్ నియమాలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. అటువంటి వారిని నియంత్రించేందుకు ఈ అప్డేట్ను తీసుకొస్తున్నాం. వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడం అనేది మా భద్రతా నిబంధనలకు వ్యతిరేకం. అటువంటి పోస్ట్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఈ కొత్త నిబంధన నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది అని పేర్కొంది.
ఇక కొత్త పాలసీ అప్‌డేట్ ప్రకారం..ఫైనాన్షియల్ ట్రాన్స్ జాక్షన్ కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం ఉల్లంఘన కిందకు వస్తుందని, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, జీపీఎస్ లోకేషన్, ఫోన్ నెంబర్లు, చిరునామా, ఈమెయిల్స్ ట్విట్టర్ లో షేర్ చేయడానికి వీల్లేదు. ప్రజాప్రయోజనాల కోసం ఇతరులకు సంబంధించి మీడియా షేర్ చేసే పోస్టులకు ఈ నిబంధన వర్తించదు. చర్యల్లో భాగంగా ఈ వ్యవహారం తీవ్రతను బట్టి అకౌంట్ ను తాత్కాలికంగా బ్లాక్ చేయడం లేదంటే పర్మినెంట్ గా సస్పెండ్ చేయడమో జరుగుతుందని ట్విట్టర్ తెలిపింది.