Best 5G Phone Under 10000: రూ.10 వేలకే రూ.50 వేల ఫీచర్లు.. దమ్మున స్మార్ట్‌ఫోన్లు.. అమెజాన్‌‌ ఆఫర్ల రచ్చ..!

Best 5G Phone Under 10000: రూ.10 వేలల్లో టాప్ 5జీ ఫోన్లు. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు. అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-09-29 11:28 GMT

Best 5G Phone Under 10000

Best 5G Phone Under 10000: పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో సేల్ కూడా కొనసాగుతున్నాయి. ఫోన్‌లు, టీవీ, ఎలక్ట్రానిక్స్,  గృహోపకరణాలతో సహా వందలాది ఉత్పత్తులపై తగ్గింపు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మీరు సరసమైన 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే రూ. 10,000 రేంజ్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Moto G45 5G
మోటరోలా నుండి వచ్చిన ఈ హ్యాండ్‌సెట్ 6.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Snapdragon 6s Gen3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది 4GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000mAh. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రూ. 9,999కి వస్తుంది.

Lava Blaze 5G
ఇది కాంపాక్ట్, శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity 700 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగి ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000mAh. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని ధర రూ.9,299.

Nokia G42 5G
ఈ Nokia ఫోన్‌లో Qualcomm Snapdragon 480+ ప్రాసెసర్ ఉంది. ఇది గ్రాఫిక్స్ కోసం Adreno 619 GPUతో వస్తుంది. ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4GB+2GB (వర్చువల్ RAM సపోర్ట్),  50MP వెనుక కెమెరా సపోర్ట్ 2 సంవత్సరాల పాటు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 9,999. ఈ ఫోన్ అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Redmi 13C 5G
ఈ Redmi ఫోన్ 6.74 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 720×1600 పిక్సెల్‌లు. ఇది MediaTek Dimensity 6100 Plus ప్రాసెసర్‌తో ఆధారంగా 4GB RAM +128GB స్టోరేజ్ కలిగి ఉంది. ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.  18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని ధర రూ.9,199.

Poco M6 5G
పోకో ఈ ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.  ఇది MediaTek Dimensity 6100 Plus ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగి ఉంది. దీనిలో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. రూ. 9,249కి కొనుగోలు చేయవచ్చు.

Infinix Hot 50 5G
చైనీస్ కంపెనీ ఇన్ఫినిక్స్  ఈ హ్యాండ్‌సెట్ కూడా ఈ జాబితాలో మంచి ఎంపిక. ఇది 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 9,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News