Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ.50 000 వేలకంటే తక్కువే.. అవేంటంటే..!
Electric Scooters: పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.
Electric Scooters: పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలు వైపు చూస్తున్నారు. కానీ ధర ఎక్కువని అనుకుంటారు. అలాంటి వారికి ఈ నాలుగు స్కూటర్లు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఇవి కేవలం రూ. 50,000 కంటే తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం నడపవచ్చు. ఈ స్కూటర్ల గొప్ప లుక్, ఫీచర్లు మిమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పెరగడానికి అతిపెద్ద కారణం బడ్జెట్‌లో రావడమే. మీ బడ్జెట్ ప్రకారం మీకు బెస్ట్ స్కూటర్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 46,640 నుంచి రూ. 56,940 వరకు ఉంటుంది. దీని బ్యాటరీ ఒక్క ఛార్జ్‌కి 85 కిలోమీటర్లు నడుస్తుంది. ఇది కాకుండా హీరో ఎలక్ట్రిక్ డ్యాష్ ఒక ఛార్జీకి 60 కిలోమీటర్లు నడుస్తుంది. ధర రూ. 50,000.
ఎవోలెట్ పోనీ
Evolet పోనీ అనేది రూ.39,541 నుంచి రూ.49,592 వరకు ఉండే ఆర్థికపరమైన ఎంపిక. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 82 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం దీని ప్లస్ పాయింట్.
ఒకినావా రిడ్జ్
దీని ప్రారంభ ధర రూ.47,980. వినియోగదారుల హృదయాలను గెలుచుకున్న ఈ స్కూటర్ బ్యాటరీ పరిధి 84 కిలోమీటర్లు. ఇది కాకుండా Avon E స్కూట్ ధర 45,000 మాత్రమే. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు నడుస్తుంది.
ఆంపియర్ రియో ఎలైట్
దీని ప్రారంభ ధర రూ. 49,999. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్‌తో 121 కి.మీల వరకు నడపవచ్చు. దీని తర్వాత బడ్జెట్ ఫ్రెండ్లీ రూ. 43,490 ఆంపియర్ రియో 60 కి.మీ వరకు బ్యాటరీ పరిధిని కలిగి ఉంటుంది.