Green 5G: నోకియా- ఎయిర్‌టెల్ గ్రీన్ 5జీ.. దీని ఉపయోగం ఏంటో తెలుసా?
Green 5G: గ్రీన్ 5G కోసం టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ , ఫిన్లాండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ నోకియా కలిసి పనిచేశాయి.
Green 5G: గ్రీన్ 5G కోసం టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ , ఫిన్లాండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ నోకియా కలిసి పనిచేశాయి. ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్‌లో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఏటా 1,43,413 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం దీని లక్ష్యం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్, అలాగే అధునాతన సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, తాజా పరిష్కారాల ద్వారా ఎయిర్‌టెల్ 4G/5G రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (RAN) శక్తి సామర్థ్యాన్ని పెంచుతుందని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
నోకియా, ఎయిర్‌టెల్ తమ ఉమ్మడి ప్రకటనలో ఈ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఎయిర్‌టెల్ కార్బన్ ఉద్గారాలను ఏటా 1,43,413 టన్నులు తగ్గించవచ్చని భావిస్తున్నారు. భాగస్వామ్యంలో విద్యుత్ ఆదా అవుతుంది. శక్తి నిర్వహణ ఉత్తమంగా ఉంటుంది.
నోకియా ఇండియా మొబైల్ నెట్‌వర్క్స్ హెడ్ తరుణ్ ఛబ్రా మాట్లాడుతూ 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా నికర జీరో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను సాధించేందుకు నోకియా కట్టుబడి ఉంది.
మా కొత్త సాంకేతికతలు టెలికాం నెట్‌వర్క్, మొత్తం పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మా కస్టమర్‌లు వారి శక్తి సామర్థ్య లక్ష్యాలకు దోహదం చేస్తూ వారి శక్తి వినియోగాన్ని తగ్గించడంలో గణనీయంగా సహాయపడతాయి. ఈ భాగస్వామ్యం వల్ల కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ) రణదీప్ సెఖోన్ తెలిపారు.