iPhone: 'నాకు ఇండియా నుంచి ఐఫోన్ కొని పంపివ్వు..' ఇండియన్స్‌కు అమెరికా ఫ్రెండ్స్ ఫోన్లు!
iPhone: ట్రంప్ నిర్ణయాలు కేవలం ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్‌నే కాదు... ఆయా దేశాల ప్రజల కొనుగోలు శక్తిపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఐఫోన్ కొనాలంటే ఇకపై అమెరికా కన్నా ఇండియానే చవక అయ్యే కాలం రాబోతుందేమో!

iPhone: 'నాకు ఇండియా నుంచి ఐఫోన్ కొని పంపివ్వు..' ఇండియన్స్‌కు అమెరికా ఫ్రెండ్స్ ఫోన్లు!
iPhone: అమెరికాలో ట్రంప్ తీసుకున్న తాజా టారిఫ్ నిర్ణయాలు అక్కడి ఎన్ఆర్ఐలను ఊహించని దిశలో నడిపించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో ఐఫోన్ల ధరలు బలంగా పెరగబోతున్న నేపథ్యంలో, యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు విషయంలో ఇకపై భారతదేశం మెరుగైన ఆప్షన్‌గా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పుడు జరుగుతున్నదేమిటంటే, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చైనా, ఇండియా లాంటి దేశాల నుండి దిగుమతులపై భారీగా టారిఫ్‌లు విధించారు. చైనాపై 54 శాతం, భారత్‌పై 26 శాతం టారిఫ్ విధించగా, వియత్నాం వంటి దేశాలకూ 46 శాతం వరకూ టారిఫ్‌లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీకి పెద్ద సమస్య ఎదురవుతోంది. చైనాలో భారీగా ఉత్పత్తి చేసే ఈ సంస్థకు వ్యయ భారం పెరుగుతోంది. దీంతో లాభాలను కాపాడుకునేందుకు అమెరికాలో ఐఫోన్ల ధరలను 30 నుంచి 40 శాతం వరకు పెంచే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి. iPhone 16 Pro Max వంటి ప్రీమియం మోడళ్ల ధరలు $700 కన్నా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉందట.
ఇలాంటి వేళ, ఇండియాలో తయారవుతున్న ఐఫోన్లు మళ్లీ ప్రధాన ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. యాపిల్ ఇప్పటికే భారత్‌లో భారీ స్థాయిలో అసెంబ్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికాలో టారిఫ్ శాతం చైనాతో పోలిస్తే తక్కువగా ఉండటంతో అక్కడున్న ఎన్ఆర్ఐలు, భారత్‌లో ఉన్న తమ బంధువులను ఐఫోన్ కొనమని అడిగే పరిస్థితి తలెత్తొచ్చు.
ఇదే కంటిన్యూ అయితే, అమెరికాలో ఉండే మిత్రులు, బంధువులు తమ ఇండియా టూర్ల సమయంలో ఐఫోన్ల షాపింగ్ చెయ్యమంటూ ఫ్రెండ్స్‌ను అడగడం ప్రారంభించవచ్చు.