Starlink: భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు.. ఎలా పని చేస్తుంది? దీని ఉపయోగం ఏంటి.?

Starlink Internet in India: స్టార్‌లింక్‌ సేవలు త్వరలో భారతదేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Update: 2025-03-13 06:48 GMT

Starlink: భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు.. ఎలా పని చేస్తుంది? దీని ఉపయోగం ఏంటి.?

Starlink Internet in India: స్టార్‌లింక్‌ సేవలు త్వరలో భారతదేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సంస్థ జియో, ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే దేశంలో సేవలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం స్టార్‌లింక్ ప్రపంచంలోని 100కిపైగా దేశాల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. ఈ సాంకేతికతతో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సులభంగా అందుబాటులోకి వస్తుంది.

స్టార్‌లింక్ ఎలా పనిచేస్తుంది?

స్టార్‌లింక్‌ సేవలు ఫైబర్ కేబుల్స్‌ లేదా మొబైల్ టవర్లపై ఆధారపడవు. దీని బదులుగా, ఇది తక్కువ ఎత్తున భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్‌ను ప్రసారం చేస్తుంది. ఈ ఉపగ్రహాలను కంపెనీ కాలానుగుణంగా కొత్త సాంకేతికతతో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. స్టార్‌లింక్ సేవను ఉపయోగించాలంటే వినియోగదారులకు ప్రత్యేక రూటర్‌ అవసరం ఉంటుంది. డిష్‌ నేరుగా ఉపగ్రహంతో కనెక్ట్‌ అయి, ఇంటర్నెట్‌ను అందిస్తుంది.

ఆ తర్వాత రౌటర్ ద్వారా ఇంటర్నెట్‌ను మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధానంలో కనెక్టివిటీ స్థిరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది భూమిపై ఉన్న నెట్‌వర్క్‌లా కాకుండా, ప్రకృతి కారణాల వల్ల తలెత్తే అంతరాయాలు తక్కువగా ఉంటాయి.

స్టార్‌లింక్‌ సేవల ప్రత్యేకతలు:

గ్రామాలు, గిరిజన ప్రాంతాలు వంటి చోట్ల గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం కష్టమే. అయితే స్టార్‌లింక్ ఉపగ్రహాల ద్వారా అక్కడ కూడా ఇంటర్నెట్‌ సులభంగా అందుతుంది. పర్వతాలు, అడవులు, ద్వీపాలు వంటి చోట్ల కూడా ఈ సేవ పని చేస్తుంది. అదనంగా కొన్ని పరికరాలతో ఈ సేవను బస్సులు, కార్లు, ఓడలు వంటి వాహనాల్లోనూ ఉపయోగించవచ్చు. అయితే ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ కంటే స్పీడ్‌ తక్కువగా ఉండొచ్చు. అయినా కూడా ఇది కనెక్టివిటీకి సంబంధించి విస్తృత కవర్‌ను అందిస్తుంది.

Tags:    

Similar News