Air Cooler: మండే ఎండలో చల్లచల్లని ఎయిర్‌ కూలర్స్‌.. ఫ్లిప్‌కార్ట్‌ బెస్ట్‌ కూలర్స్‌ ఇవే..!

Best Air Coolers In Flipkart: ఎండాకాలం మొదలైంది.. ఇక చల్ల నీరు, చల్లని గాలి కోసం అందరూ తహతహలాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు ఉపయోగించడం ప్రారంభమవుతుంది.

Update: 2025-03-14 10:19 GMT
Air Cooler: మండే ఎండలో చల్లచల్లని ఎయిర్‌ కూలర్స్‌.. ఫ్లిప్‌కార్ట్‌ బెస్ట్‌ కూలర్స్‌ ఇవే..!
  • whatsapp icon

Best Air Coolers In Flipkart: ఎండాకాలం మొదలైంది.. ఇక చల్ల నీరు, చల్లని గాలి కోసం అందరూ తహతహలాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు ఉపయోగించడం ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఎయిర్ కూలర్లు అతి తక్కువ ధరలను అందుబాటులో ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్స్‌ కూడిన ఎయిర్ కూలర్ల జాబితా తెలుసుకుందాం..

మండు వేసవికాలంలో చల్లగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దీంతో ఇంట్లో కూలర్లు, ఏసీలు ఉపయోగిస్తారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎయిర్ కూలర్ల పై అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ మండువేసవిలో మీరు కూడా ఎంచక్కా చల్లని గాలిచే కూలర్లను కొనుగోలు చేయవచ్చు

ఓరియంట్ ఎలక్ట్రిక్ 46L రూమ్ ఎయిర్ కూలర్..

ఓరియంట్ ఎలక్ట్రిక్ 46L ఎయిర్ కూలర్ హై పవర్‌తోపాటు స్పేస్ కూడా సేవ్ చేస్తుంది. దీని కూలింగ్ అదిరిపోతుంది. ఒకవేళ మీ ఇల్లు కాస్త చిన్నగా, మీడియం సైజులో ఉంటే ఇలాంటి ఎయిర్ కూలర్లను ఎంచుకోండి. ఎయిర్ కూలర్ 46 లీటర్స్ కలిగి ఉంది. ఇందులో హనీ కాంబో కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి. దీంతో గాలి చల్లగా వస్తుంది. అంతేకాదు కాస్త దూరంగా పెట్టినా రూమ్‌ మొత్తం కూలింగ్ వస్తుంది. మల్టిపుల్ స్పీడ్ మోడ్స్ కంట్రోల్ కూడా ఉంది. దీని బరువు లైట్ వెయిట్ గానే ఉంటుంది. కాబట్టి ఈజీగా తరలించవచ్చు, క్యాస్టర్ వీల్స్ ఉంటాయి.

హిండ్వేర్‌ స్మార్ట్ అప్లైయన్స్ 45L ఎయిర్ కూలర్…

హిండ్వేర్‌ అంటేనే అప్లయన్స్‌కు నమ్మకమైన కంపెనీ. ప్రధానంగా హౌస్ హోల్డ్ అప్లయన్స్ విక్రయాల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఎనర్జీ సేవింగ్ తో పాటు చిన్న రూములకు ఇది బాగా సరిపోతుంది.. ఇన్వర్టర్ కంపాటబుల్. ఇందులో అదిరిపోయే మరో ఫీచర్ వాటర్ లెవెల్ ఇండికేటర్.

క్రాంప్టన్ 88L డెజర్ట్‌ ఎయిర్ కూలర్..

మీరు మంచి కూలింగ్ వచ్చే ఎయిర్ కూలర్ కొనుగోలు చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. క్రాంప్టన్ 88 లీటర్స్ డెజర్ట్‌ ఎయిర్ కూలర్. హై కెపాసిటీ, ఇది పెద్ద సైజు రూమ్‌కు సరిపోతుంది. ఈ కూలర్‌ 88 లీటర్ల వాటర్‌ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ కూలర్‌లో కూడా హనీకాంబో కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి. గదులు పెద్దగా ఉంటే కూడా చల్లని గాలివీస్తుంది. ఆటోమేటిక్‌ మూమెంట్ కలిగి ఉన్న ఎయిర్ కూలర్.

వోల్టాస్ 55 లీటర్స్ డెజర్ట్ కూలర్..

వోల్టాస్ బ్రాండ్ కూడా చాలా పాపులర్. వోల్టాస్‌ 55L డెజర్ట్‌ ఎయిర్‌ కూలర్‌ కూడా కూలింగ్ టెక్నాలజీ అదిరిపోతుంది. విక్టర్ 55 డిఎక్స్ ఎయిర్ కూలర్. హై పవర్ టెక్నాలజీ తో తయారు చేశారు. కూలింగ్ తోపాటు వేడి ఎక్కువ ఉన్న వాతావరణంలో కూడా కూలింగ్ ఇస్తుంది. 55 లీటర్ల ఈ కూలర్‌ ఎయిర్ ఫ్లోర్ గరిష్టంగా పొందవచ్చు. పెద్ద గదులకు ఇది బాగా సెట్ అవుతుంది. డస్ట్ ఫిల్టర్ కూడా అందుబాటులో ఉంది. శబ్దం రాకుండా హై స్పీడ్ సెట్టింగ్స్ కలిగి ఉంది.

Tags:    

Similar News