Samsung Galaxy F16 5G: సామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్ లాంచ్.. రూ.11,499లకే ప్రీమియం ఫీచర్స్..!
Samsung Galaxy F16 5G: సామ్‌సంగ్ ఎట్టకేలకు తన కొత్త బడ్జెట్ ఫోన్ 'Samsung Galaxy F16 5G'ని భారత్ మార్కెట్లో విడుదల చేసింది.
Samsung Galaxy F16 5G: సామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్ లాంచ్.. రూ.11,499లకే ప్రీమియం ఫీచర్స్..!
Samsung Galaxy F16 5G: సామ్‌సంగ్ ఎట్టకేలకు తన కొత్త బడ్జెట్ ఫోన్ 'Samsung Galaxy F16 5G'ని భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లతో సామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. ఈ ఫోన్ గొప్ప ఫీచర్ ఏమిటంటే తాజా One UI 7తో మాత్రమే కాకుండా, ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు ఆరు సంవత్సరాల వరకు అందుతాయి. అలాగే, ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం ఒక్కసారిగా తెలుసుకుందాం.
Samsung Galaxy F16 5G Features And Specifications
కొత్త గెలాక్సీ F16 5Gలో U- ఆకారపు నాచ్‌తో 6.7-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ 1080 x 2340 పిక్సెల్‌ల FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఫోన్ పైన వన్ UI 7 లేయర్‌తో Android 15తో వస్తుంది. ఆరు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్స్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 8 GB వరకు RAM, 128 GB స్టోరేజ్ ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ప్యాక్ ఫోన్‌లో చూడచ్చు.
గెలాక్సీ F16లో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. దీని వెనుక ప్యానెల్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇది 11 5G బ్యాండ్‌లకు సపోర్ట్, సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఇతర ఫీచర్‌లను అందిస్తుంది. ఫోన్ కొలతలు 164.4 x 77.9 x 7.9 మిమీ, రువు 191 గ్రాములు.
Samsung Galaxy F16 5G Price
ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న Galaxy F16 బ్యానర్ ఆధారంగా.. ఆఫర్‌లతో రూ.11,499కి ఫోన్‌ను కొనచ్చు. దీని సేల్ మార్చి 13 నుంచి ప్రారంభం కానుంది. అయితే, గత నెలలో వెలువడిన లీక్ ప్రకారం, F16 మూడు వేరియంట్‌ల ధర వరుసగా రూ. 13,999, రూ. 14,999, రూ. 16,499గా ఉండచ్చు.