Vivo Y58 5G Price Drop: ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్.. వివో Y58 5జీ మొబైల్‌పై భారీ డిస్కౌంట్..!

Vivo Y58 5G Price Drop: వివో భారతదేశంలో అనేక రకాల ఫోన్‌లను విడుదల చేస్తోంది. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రతి మొబైల్‌కు మంచి స్పందన వస్తోంది. Vivo స్మార్ట్‌ఫోన్‌లు విభిన్న డిజైన్, బెస్ట్ ఫీచర్స్ అందిస్తాయి.

Update: 2025-03-14 14:17 GMT
Vivo Y58 5G Price Drop

Vivo Y58 5G Price Drop: ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్.. వివో Y58 5జీ మొబైల్‌పై భారీ డిస్కౌంట్..!

  • whatsapp icon

Vivo Y58 5G Price Drop: వివో భారతదేశంలో అనేక రకాల ఫోన్‌లను విడుదల చేస్తోంది. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రతి మొబైల్‌కు మంచి స్పందన వస్తోంది. Vivo స్మార్ట్‌ఫోన్‌లు విభిన్న డిజైన్, బెస్ట్ ఫీచర్స్ అందిస్తాయి. అందుకే Vivo ఫోన్‌లకు భారతదేశం అంతటా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు, కంపెనీ తన స్టైలిష్ Vivo 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ ఫీచర్స్, ధర, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Vivo Y58 5G Offers

Vivo Y58 5G ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 19,499. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 31శాతం తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మీరు కేవలం రూ.16,376కి ఆర్డర్ చేయచ్చు. మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ మొబైల్ హిమాలయన్ బ్లూ, సుందర్బన్ గ్రీన్ కలర్లలో వస్తుంది.

Vivo Y58 5G Features

Vivo Y58 5G మొబైల్‌లో 6.72 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది LCD డిస్‌ప్లే . ఈ డిస్‌ప్లే 2,408 x 1,080 పిక్సెల్ రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్, 1,024 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది Android 14 ఆధారిత Funtouch OS 14తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఫోన్‌లో 6000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, 4G, 5G, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

Tags:    

Similar News