Realme Narzo 70 Turbo 5G: అవాక్కయ్యారా.. రియల్‌మీ నుంచి కొత్త 5జీ ఫోన్.. డిజైన్ సూపర్..!

Realme Narzo 70 Turbo 5G: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ నార్జో 70 టర్బో 5Gని త్వరలో విడుదల చేయనుంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

Update: 2024-08-23 08:43 GMT

Realme Narzo 70 Turbo 5G

Realme Narzo 70 Turbo 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మీ టెక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నార్జో 70 సిరీస్‌‌లో కొత్త ఫోన్లను విడుదల చేసింది. అందులో Narzo 70x, Narzo 70, Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో కొత్త ఎడిషన్ త్వరలో రాబోతుంది. ఈ ఫోన్ రియల్‌మీ నార్జో 70 టర్బో 5G. ఇది త్వరలో దేశంలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు లాంచ్‌కు ముందే ర్యామ్, స్టోరేజ్. కలర్ వేరియంట్‌ వంటి ఫోన్ స్పెసిఫికేషన్‌లులీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Realme Narzo 70 Turbo 5G  Specifications (రియల్‌మీ నార్జో 70 టర్బో 5G స్పెసిఫికేషన్స్)
రియల్‌మీ త్వరలో Realme Narzo 70 Turbo 5G ఫోన్‌ను విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఫోన్ ర్యామ్, స్టోరేజ్, కలర్ వేరియంట్‌లు వంటి స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఫోన్ మోడల్ నంబర్ RMX5003గా తెలుస్తోంది. రాబోయే ఫోన్ మోడల్ నంబర్ RMX5002తో Realme 13+ 5G రీబ్రాండెడ్ మోడల్‌గా ఉండే అవకాశం ఉంది.

రియల్‌మీ నార్జో 70 టర్బో 5G స్పెసిఫికేషన్‌లు కూడా బయటకు వచ్చాయి. ఫోన్‌లో RAM కోసం మూడు వేరియంట్‌లను చూడవచ్చు. ఇందులో 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లు ఉంటాయి. ఫోన్ కలర్ వేరియంట్‌ల విషయానికొస్తే ఇది పర్పుల్, ఎల్లో, గ్రీన్ కలర్స్‌లో రావచ్చు.

కెమెరా గురించి మాట్లాడితే ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను చూడవచ్చు. దీనిలో EIS ఫీచర్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చూడవచ్చు. ఫోన్ ధర దాదాపు రూ. 25,000 ఉంటుంది. ఫోన్ Realme 13+ 5G రీబ్రాండెడ్ వెర్షన్. ఇతర స్పెసిఫికేషన్‌లు కూడా అలాగే ఉండవచ్చు.

Realme 13+ 5G ఆగస్టు 29న దేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో కూడిన 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో ఉంటుంది. Realme ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది.

Tags:    

Similar News