Samsung Galaxy A16 5G: సామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయ్.. లాంచ్ ఎప్పుడంటే?
Samsung Galaxy A16 5G: టెక్ కంపెనీ సామ్‌సంగ్ త్వరలో భారతదేశంలోని తన వినియోగదారుల కోసం కొత్త ఫోన్‌ను తీసుకురానుంది.
Samsung Galaxy A16 5G: టెక్ కంపెనీ సామ్‌సంగ్ త్వరలో భారతదేశంలోని తన వినియోగదారుల కోసం కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్ సామ్‌సంగ్ A16 5G గా ఉంటుంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారిక వెబ్‌సైట్ Samsung.inలో కంపెనీ లిస్ట్ చేసింది. ఈ ఫోన్ భారతదేశంలో రెండు స్టోరేజ్ ఆప్షన్‌లు, నాలుగు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ని యూరప్‌లో ప్రవేశపెట్టారు.
సామ్‌సంగ్ గెలాక్సీ A16 5G ల్యాండింగ్ పేజీ స్మార్ట్‌ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ ఫోన్ కొనడానికి అందుబాటులో లేదు. కానీ కంపెనీ టీజ్ చేసిన పోస్ట్‌లో దానిపై 'కమింగ్ సూన్' అని రాసి ఉంది. ఫోన్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB, 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫోన్‌ను లైట్ గ్రీన్, బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో ఆర్డర్ చేయచ్చు.
Samsung Galaxy A16 5G Features
ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో Exynos 1330 చిప్‌సెట్ ఉంది. Galaxy A15 5G డైమెన్సిటీ 6100+ SoCతో వస్తుంది. ఇది Android 14 ఆధారిత One UI 6.1.1 కస్టమ్ స్కిన్‌పై నడుస్తుంది.
ఈ ఫోన్‌తో 6 సంవత్సరాల OS అప్‌డేట్‌లను కంపెనీ అందిస్తోంది, ఇది బడ్జెట్ సెగ్మెంట్ మోడల్‌లో మొదటిది. కెమెరా గురించి మాట్లాడితే సామ్‌సంగ్ గెలాక్సీ A16 5G 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ , 2MP మాక్రో యూనిట్‌ని కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP స్నాపర్ ఉంది.
ఫోన్‌లో భద్రత కోసం సైడ్మౌం టెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్ప్లాష్‌ల నుండి ఫోన్‌ను రక్షించడానికి IP54 రేటింగ్ ఉంది. ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.