Samsung Galaxy F34: 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. 50ఎంపీ కెమెరా.. 5 ఏళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్.. అదిరిపోయే ఫీచర్లతో శాంసన్ గెలాక్సీ ఏ34.. ధర ఎంతంటే?
Samsung Galaxy F34: టెక్ కంపెనీ శాంసంగ్ కొత్త కలర్ 'ఆర్కిడ్ వైలెట్'లో 'Samsung Galaxy F34 5G' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
Samsung Galaxy F34: టెక్ కంపెనీ శాంసంగ్ కొత్త కలర్ 'ఆర్కిడ్ వైలెట్'లో 'Samsung Galaxy F34 5G' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కలర్ ఆప్షన్‌లోని స్మార్ట్‌ఫోన్ బిగ్ బిలియన్ డే రోజున ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఇది కాకుండా వినియోగదారులు Samsung అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయవచ్చు. కంపెనీ ఇంతకు ముందు ఆగస్ట్ 7న రెండు వేరియంట్లలో, రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేసింది.
కంపెనీ ఈ ఫోన్‌లో 6000 mAh పెద్ద బ్యాటరీని అందించింది. దీనితో పాటు, స్మార్ట్‌ఫోన్ 6.46 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది.
Samsung ఈ ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999లుగా పేర్కొనగా, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 20,999లు పేర్కొంది.
Samsung Galaxy F34 5G: స్పెసిఫికేషన్‌లు..
డిస్ ప్లే: Samsung Galaxy F34 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.46-అంగుళాల పూర్తి HD + AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. డిస్‌ప్లే భద్రత కోసం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందించింది.
హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్: పనితీరు కోసం, ఫోన్ 5nmలో నిర్మించిన Exynos 1280 ప్రాసెసర్‌తో అందించింది. ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా OneUI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
కెమెరా: ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, ఛార్జింగ్: పవర్ బ్యాకప్ కోసం, ఫోన్ 6000 mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, 2 రోజుల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
కనెక్టివిటీ ఎంపికలు: కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 11 5G బ్యాండ్‌లు, 2G, 3G, 4G, Dolby Atmos, Samsung Wallet ఉన్నాయి. 'Samsung Galaxy F34 5G' స్మార్ట్‌ఫోన్ కొత్త రంగు 'ఆర్కిడ్ వైలెట్'లో విడుదలైంది.
కంపెనీ 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు, 4 జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.