Jio Vs BSNL: జియో వర్సెస్ బీఎస్ఎన్ఎల్.. తక్కువ ధరకే 98 రోజులు కాలింగ్, డేటా
Jio Vs BSNL: రిలయన్స్ జియో ఇటీవల దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో వినియోగదారులకు ఉచిత రీఛార్జ్, డేటా మొదలై బెనిఫిట్స్ అందించింది.
Jio Vs BSNL: రిలయన్స్ జియో ఇటీవల దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో వినియోగదారులకు ఉచిత రీఛార్జ్, డేటా మొదలై బెనిఫిట్స్ అందించింది. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ పెరుగుతున్న వినియోగదారులను ఆకర్షించడానికి రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో వినియోగదారులు వరుసగా 90, 98 రోజుల వాలిడిటీని పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం రోజుకు రూ. 10 కంటే తక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను పొందుతారు.
అయితే రిలయన్స్ జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌లు వరుసగా రూ. 899, రూ. 999లకు వస్తాయి. రూ. 899 ప్లాన్‌లో వినియోగదారులు 90 రోజుల వాలిడిటీని పొందుతారు. అదే సమయంలో రూ. 999 ప్లాన్‌లో 98 రోజుల వాలిడిటీ ఉంటుంది. రండి రిలయన్స్ జియో ఈ రెండు చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
జియో రూ. 899 ప్లాన్
ఈ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లో రిలయన్స్ జియో 20GB అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 90 రోజుల పాటు ఏదైనా నెట్‌వర్క్‌లో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఫ్రీ నేషనల్ రోమింగ్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.ప్రతిరోజూ 2జీబీ డేటా ప్రయోజనాన్ని పొందుతారు. వినియోగదారులకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎమ్‌ఎస్‌లతో సహా అనేక ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
జియో రూ. 999 ప్లాన్
జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 98 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2GB డేటా ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా ఈ రీఛార్జ్ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్ఎమ్ఎస్‌లు వస్తాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కంపెనీ వినియోగదారులకు జియో టీవీ, జియో సినిమా యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
జూలైలో ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌లు పెంచినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులలో భారీ పెరుగుదల ఉంది. జూలై, ఆగస్టులో కంపెనీ 55 మిలియన్ల కొత్త వినియోగదారులను చేర్చుకుంది. ఈ కాలంలో రిలయన్స్ జియో అత్యధిక నష్టాన్ని చవిచూసింది. కంపెనీ 40 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది.