Samsung Galaxy Z Fold 5: ప్రపంచంలోనే సన్నని, తేలికైన ఫోల్డబుల్ ఫోన్.. భారత్‌లో విడుదల చేసిన శాంసంగ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
దక్షిణ కొరియా కంపెనీ Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 లను గురువారం (జులై 27) భారతదేశంలో విడుదల చేసింది.
Samsung Galaxy Z Fold 5: దక్షిణ కొరియా కంపెనీ Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 లను గురువారం (జులై 27) భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ Galaxy Z Flip 5 ప్రారంభ ధరను రూ. 99,999 వద్, Galaxy Z Fold 5 ప్రారంభ ధరను రూ 1,54,999 వద్ద ఉంచింది. లాంచ్‌తో పాటు, రెండు స్మార్ట్‌ఫోన్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులోకి వచ్చాయి.
అంతకుముందు, కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ S9 సిరీస్‌లను బుధవారం జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ లైవ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జులై 29 వరకు దక్షిణ కొరియాలోని సియోల్‌లో కొనసాగుతుంది.
ప్రపంచంలోనే అత్యంత సన్నని, తేలికైన ఫోల్డబుల్ ఫోన్..
Samsung Galaxy Z Fold 5 స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని, తేలికైన ఫోల్డబుల్ ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 129.9x154.9 x 6.1mm ఉంటుంది. మడతపెట్టినప్పుడు దాని కొలతలు 67.1 x 154.9 x 13.4 మిమీలుగా ఉన్నాయి. దీని బరువు 253 గ్రాములుగా నిలిచింది.
Samsung Galaxy Z ఫోల్డ్ 5: స్పెసిఫికేషన్స్..
డిస్ప్లే: ఫోన్ 7.6-అంగుళాల డైనమిక్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. దీని రిజల్యూషన్ 2,176x1,812 పిక్సెల్స్. ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల HD + డైనమిక్ AMOLED 2X కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్: ఫోన్ Android 13 ఆధారిత One UI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీన్ని ప్రాసెస్ చేయడానికి ఫోన్‌లో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు.
ర్యామ్, స్టోరేజ్: ఫోన్‌లో 12GB RAMతో 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి.
కెమెరా: ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 12MP అండర్ డిస్‌ప్లే కెమెరా, సెకండరీ ప్యానెల్‌లో 12MP కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం డిస్ప్లే కెమెరా కింద 10MP + 4MP అందించారు.
బ్యాటరీ, ఛార్జర్: ఫోన్ 4400 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఛార్జింగ్ కోసం 25W హై స్పీడ్ ఛార్జింగ్ మద్దతును పొందుతుంది. ఈ ఫోన్‌ను 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. పరికరంలో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఉంది.
కనెక్టివిటీ: కనెక్టివిటీ కోసం, పరికరం NFC, WIFI 6E, బ్లూటూత్ 5.2, USB-C 3.2 పోర్ట్, నానోసిమ్, ESIM మద్దతుతో వస్తుంది. భద్రత కోసం, హ్యాండ్‌సెట్ IPX8 రేటింగ్, భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5..
Z ఫ్లిప్ 5 అల్యూమినియం ఫ్రేమ్‌పై నిర్మించారు. దాని వెనుక, ముందు ప్యానెల్‌లపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉపయోగించారు. ఫోన్ IPX8 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ చేస్తుంది. పర్యావరణానికి సురక్షితమైన రీసైకిల్ మెటీరియల్‌తో ఫోన్‌ను తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. మడతపెట్టినప్పుడు ఫోన్ కొలతలు 71.9x85.1x15.1mm. అదే సమయంలో ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 71.9x165.1x6.9mmగా ఉంటుంది. దీని బరువు 187 గ్రాములు మాత్రమే.
Samsung Galaxy Z ఫ్లిప్ 5: స్పెసిఫికేషన్‌లు..
డిస్ప్లే: Galaxy Z Flip 5 6.7-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. డిస్‌ప్లేపై పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ఇచ్చారు. ఫోన్ కవర్‌పై 60Hz రిఫ్రెష్ రేట్‌తో 3.4-అంగుళాల సూపర్ HD+ డిస్‌ప్లే అందుబాటులో ఉంది.
ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్: Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ మొబైల్‌లో అందుబాటులో ఉంది. దీని క్లాక్ స్పీడ్ 3.36GHz. ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
కెమెరా: ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఇందులో 12MP ప్రైమరీ కెమెరా లెన్స్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10MP కెమెరా ఇచ్చారు.
ర్యామ్, స్టోరేజ్: స్టోరేజ్ విషయానికొస్తే, ఈ ఫోన్ 8GB RAMతో 256GB, 512GB వరకు అంతర్గత నిల్వతో వస్తుంది.
బ్యాటరీ: ఫోన్ 3700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఛార్జింగ్ కోసం 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును పొందుతుంది. ఇది 30 నిమిషాల్లో ఫోన్‌ను 0 నుంచి 50% వరకు ఛార్జ్ చేయగలదు. దీన్ని వైర్‌లెస్‌గా కూడా ఛార్జ్ చేయవచ్చు.
కనెక్టివిటీ : ఫ్లిప్ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం, డేటా సింక్ కోసం 5G, 4G, LTE, WIFI 6E, బ్లూటూత్ V5.3, GPS, USB టైప్-సి పోర్ట్ అందించారు.