Samsung Galaxy A05s: శాంసన్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. ధరెంతో తెలుసా?
Samsung Galaxy A05s: దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Galaxy A05sని భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
Samsung Galaxy A05s: దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Galaxy A05sని భారత మార్కెట్‌లో విడుదల చేసింది.Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB ఎంపికలలో ప్రారంభించబడింది. దీని 4GB + 128GB వేరియంట్ ధర రూ. 14,999లుగా పేర్కొంది.
కొనుగోలుదారులు ఈ ఫోన్‌ను గెలాక్సీ ఆన్‌లైన్ స్టోర్, ఇ-కామర్స్ వెబ్‌సైట్, సామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, కంపెనీ ఇటీవలే Galaxy Z Flip 5ని పసుపు రంగులో విడుదల చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను క్రీమ్, గ్రాఫైట్, మింట్, లావెండర్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో జులై 26న విడుదల చేశారు. Galaxy Z Flip 5 ధర రూ. 99,999లుగా పేర్కొంది.
Galaxy A05s: స్పెసిఫికేషన్‌లు..
డిస్ ప్లే: Galaxy A05s 2400x1080 రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
ప్రాసెసర్: పనితీరు కోసం, ఫోన్‌లో Qualcomm Snapdragon 680 ఆక్టాకోర్ ప్రాసెసర్ అందించింది. ఇది Android-13లో పనిచేస్తుంది.
కెమెరా: ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక ప్యానెల్‌లో 60fps రిజల్యూషన్‌తో 50MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్ అందించింది. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం ఫోన్‌లో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, ఛార్జింగ్: పవర్ కోసం, Galaxy A05s 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది.