Realme Narzo 70 Pro 5G: దిమ్మతిరిగే డీల్.. రూ.873కే 5G ఫోన్..!

Realme Narzo 70 Pro 5G: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌‌లో Realme NARZO 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌‌ను రూ. 15,998కే కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-08-11 14:29 GMT

realme narzo 70 pro 5g

Realme Narzo 70 Pro 5G: స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను తీసుకొచ్చింది. సేల్ ఆగస్టు 12 వరకు లైవ్ అవుతుంది. ఈ స్పెషల్ సేల్‌లో కొన్ని ఎంపిక చేసిన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. దీంతో తక్కువ ధరకే మొబైల్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలోనే Realme NARZO 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై బెస్ట్ డీల్‌ను ప్రకటించింది. 8జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను ఇప్పుడు ఆఫర్‌లో దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్, నో కాస్ట్ EMI కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ మొబైల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌‌తో వస్తుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఇందులో 5,000mAh కెపాసిటీ బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రియల్‌మీ నార్జో 70 ప్రో అసలు ధర రూ. 24,999. అయితే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా 28 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో మీరు రూ. 17,998కి మొబైల్ కొనుగోలు చేయవచ్చు. అలానే రూ.2000 కూపన్ కూడా ఉంది. కూపన్ ఆఫర్ ద్వారా రూ. 15,998కే మొబైల్‌ను దక్కించుకోవచ్చు. వీటితో పాటు రూ.873 నెల ఈఎమ్‌ఐగా చెల్లించి ఈ 5జీ ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ గ్లాస్ గ్రీన్ గ్లాస్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. Amazon, Realme వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

రియల్‌మీ నార్జో 70 ప్రో ఫీచర్ల విషయానికి వస్తే మొబైల్ 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 1080 x 2400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌కి సపోర్ట్ ఇస్తుంది. దీని డిస్‌ప్లే 2,000 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌‌తో వస్తుంది.  MediaTek Dimensity 7050 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Android 14లో రన్ అవుతుంది. ఇది 8GB + 128 GB, 8 GB + 256 GB వేరియంట్ అనే రెండు స్టోరేజ్ ఆప్షన్‌లను కలిగి ఉంది. మొబైల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సోనీ IMX 890 సెన్సార్, సెకండరీ కెమెరా 8 మెగా పిక్సెల్ సెన్సార్. మూడో కెమెరా 2 మెగా పిక్సెల్ కెపాసిటీతో ఉంటుంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాలో 16 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. మొబైల్‌లో 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఇది 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది హాట్‌స్పాట్, బ్లూటూత్, Wi-Fi, USB టైప్-సి పోర్ట్ వంటి ఇతర కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 8GB + 128GB వేరియంట్, 8GB + 256GB వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

Tags:    

Similar News