POCO M6: రూ. 10వేలలో 108 ఎంపీ కెమెరా.. పోకో నుంచి స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్..!
POCO M6: మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా రూ. 10వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు.
POCO M6: మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా రూ. 10వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. పోకో ఎమ్6 పేరుతో తీసుకొస్తున్న ఈ 4జీ ఫోన్‌ను జూన్ 11వ తేదీన గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. అయితే భారత మార్కట్లోకి ఈ ఫోన్ ఎప్పుడు రానుందన్నదానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనరాలేదు. ఇంతకీ పోకో ఎమ్6లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోకో ఎమ్6 ఫోన్ డిజైన్ రెడ్‌మీ 13 స్మార్ట్ ఫోన్‌ను పోలి ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఓ చిన్న టీజర్‌ను విడుదల చేసింది. జూన్11వ తేదీన ఆన్‌లైన్ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను ప్రదర్శిస్తున్నట్లు పోకో ట్విట్టర్ వేదికగా పంచుకుంది. కాగా ఈ ఫోన్‌ను బ్లాక్, వైట్‌తో పాటు గ్రే కలర్స్‌లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొస్తున్నారు.
ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర మన కరెన్సీలో రూ. 10,768గా ఉండనుంది. అలాగే 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర ఇండియన్ కరెన్సీలో రూ. 12,438గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా వీటిపై డిస్కౌంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక పోకో ఎమ్6 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియా టెక్ హీలియో జీ91 అల్ట్రా చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోణ్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన సెకండరీ కెమెరాను అందించారు. కాగా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5030 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు.