OPPO A3x 4G: ఒప్పో బడ్జెట్ ఫోన్ లాంచ్.. రేపే సేల్ స్టార్ట్..!
OPPO A3x 4G: ఒప్పో ఇటీవలే భారతదేశంలో OPPO A3x 4G ఫోన్‌ను విడుదల చేసింది.
OPPO A3x 4G: ఒప్పో ఇటీవలే భారతదేశంలో OPPO A3x 4G ఫోన్‌ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ ప్రైస్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ అక్టోబర్ 29 నుంచి సేల్‌కి రానుంది. మీరు దీపావళి పండుగ కోసం కొత్త మొబైల్ కొనాలని చూస్తున్నట్లయితే Oppo A3x 4G మంచి ఎంపిక. ఈ ఫోన్ ఫీచర్లు, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కంపెనీ గత నెలలో Oppo A3x ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు Oppo A3x 4G కూడా మార్కెట్లోకి వచ్చింది. ఇది Snapdragon 6s Gen 1 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది 6.67 అంగుళాల డిస్‌ప్లే 4GB RAM కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
Oppo A3x 4G ఫోన్ 4GB RAM+ 64GB స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ రూ. 8,999కి విడుదల చేసింది. 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.9,999కి అందుబాటులో ఉంది. ఇది నెబ్యులా రెడ్, ఓషన్ బ్లూ కలర్స్‌లో కొనచ్చు. ఇది కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా అక్టోబర్ 29 నుంచి విక్రయించనుంది.
Oppo A3x 4G Features
Oppo A3X 4G ఫోన్ 6.67-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పంచ్ హోల్ స్టైల్ LCD డిస్‌ప్లే. ఇది 1604 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1000 nitsకు సపోర్ట్ ఇస్తుంది.
కొత్త Oppo A3X 4G మొబైల్ Qualcomm Snapdragon 6s 4G Gen 1 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో Adreno 610 GPU అందించారు. ఫోన్ ఆండ్రాయిడ్ 14లో లాంచ్ చేశారు. ColorOS 14తో పనిచేస్తుంది.
ఈ ఫోన్ 4GB RAM తో వస్తుంది. ఈ ర్యామ్‌తో 64GB + 128GB స్టోరేజ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి ఈ స్మార్ట్‌ఫోన్ 4GB వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కలిగి ఉంది. మొబైల్ 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. ఇది LED ఫ్లాష్‌తో పాటు ఆటో ఫోకస్ టెక్నాలజీతో వస్తుంది. అదనంగా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం కెమెరా సెటప్‌లో ఫ్లిక్కర్ సెన్సార్ ఉంది. ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
5100mAh కెపాసిటీ బ్యాటరీతో Oppo A3x 4G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్‌ను కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.ఈ మొబైల్ కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, బ్లూటూత్ v5.0, Wi-Fi 5, GPS, IP54 రేటింగ్, 3.5mm ఆడియో జాక్, USB 2.0, USB C పోర్ట్ ఉన్నాయి.