Oppo F27 5G: ఒప్పో లవర్స్‌కు భారీ గిఫ్ట్.. 5జీ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్, ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Oppo F27 5G Price Cut: ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2 వేల డిస్కౌంట్ ప్రకటించింది.

Update: 2024-10-01 07:49 GMT

Oppo F27 5G

Oppo F27 5G Price Cut: దసరా, దీపావళి పండుగలకు ముందు ఒప్పో తన అభిమానులకు గొప్ప బహుమతిని ఇచ్చింది. Oppo F27 5G ధరను కంపెనీ రూ. 2,000 తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత ఫోన్  రూ. 20,999కి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ Oppo F27 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టులో భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ Oppo F25 5G సిరీస్ సక్సెసర్‌గా మార్కెట్‌లోకి వచ్చింది.

Oppo F27 5G మొబైల్‌ని 8GB RAM+128GB, GB+256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్‌ని ఉపయోగించారు ఈ మొబైల్‌లో 5,000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కంపెనీ Oppo F27 5Gని రెండు వేరియంట్లలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అందులో 8GB RAM+128GB, 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 ఉంది. అయితే దీనిపై రూ. 2,000 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో రూ.20,999కి కొనుగోలు చేయవచ్చు.  8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999.  ప్రస్తుత ధర తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ. 22,999కి అందుబాటులో ఉంది.

Oppo F27 5G Features
ఈ మొబైల్ 6.67 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, ఆక్వా డైనమిక్స్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 394 PPI, 100 DCI P3 కలర్ గామట్ ఆప్షన్‌లను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 2,100 నిట్స్ పీక్ బ్రైట్న్‌స్‌కు సపోర్ట్ ఇస్తుంది.

స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అదనంగా Mali G57 MP2 GPU సపోర్ట్ కూడా ఉంది. ఇది కలర్ ఓఎస్ 14తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 8GB RAM + 128GB, 8GB + 256GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఫోన్‌‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 2 మెగాపిక్సెల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ 5000mAh బ్యాటరీతో 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 

Tags:    

Similar News