Moto G85 5G: గెట్‌ రడీ.. మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ తెలిస్తే.. !

Moto G85 5G: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది.

Update: 2024-07-09 13:30 GMT

Moto G85 5G: గెట్‌ రడీ.. మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ తెలిస్తే.. !

Moto G85 5G: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. మొన్నటి వరకు బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొచ్చిన ఈ సంస్థ తాజాగా మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్స్‌ ఉన్నఓ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా మోటో జీ85 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జులై 10వ తేదీన ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మోటో జీ85 ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొస్తున్నారు. ధర విషయానికొస్తే బేస్‌ వేరియంట్‌ రూ. 18 నుంచి రూ. 20 వేల మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన పీఓఎల్‌ఈడీ డస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో పాటు ప్రొటెక్షన్ కోసం ఇందులో గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను అదించనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేయనుంది.

ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనున్న ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ టర్బో పవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అదించనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వను్నారు.

ఇక డాల్బీఆట్మోస్‌తో కూడిన సౌండ్ సిస్టమ్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఐపీ52 వాటర్‌ రెస్టిస్టెంట్ రేటింగ్‌ను ఇందులో ఇవ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌ డైమెన్షన్స్‌ విషయానికొస్తే ఈ ఫోన్‌ బరువు 172 గ్రాములు, 7.59 ఎమ్‌ఎమ్‌ మందంతో రానుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్ వేదికగా ఈ ఫోన్‌ అమ్మకానికి రానుంది. 

Tags:    

Similar News