Motorola Budget Phone: బడ్జెట్ లెజెండ్.. మోటో కొత్త ఫోన్‌పై కిల్లర్ ఆఫర్.. దీన్ని మించింది లేదు..!

Motorola Budget Phone: మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫస్ట్ సేల్ ప్రారంభంమైంది. ఈ సంద్భంగా రూ.1500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Update: 2024-09-24 10:31 GMT

Motorola Edge 50 Neo 

Motorola Budget Phone: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే డీల్ వివరాలను వెల్లడించింది. వీటి వివరాలు కూడా లైవ్ అవుతున్నాయి. అదే విధంగా ఈరోజు సేల్‌కి వస్తున్న Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌పై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఫోన్ IP68 రేటింగ్, Moto Ai పవర్డ్ కెమెరాతో వస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. మీకు ప్రత్యేక ఆఫర్‌లతో చౌకగా ఆర్డర్ చేసే అవకాశం మీకు లభిస్తుంది. కంపెనీ మోటరోలా ఎడ్జ్ 50 నియో చాలా బలమైన డిజైన్, మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌తో తీసుకువచ్చింది. ఇది మాత్రమే కాదు, రాబోయే 5 సంవత్సరాల పాటు ఈ ఫోన్‌కి సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను అందిస్తామని కంపెనీ తెలిపింది. దీని కారణంగా ఫోన్ చాలా కాలం పాటు కొత్త ఫీచర్లను పొందుతూనే ఉంటుంది.

మోటరోలా Edge 50 Neo గత నెలలో విడుదలైంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 23,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఫోన్ 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మోటరోలా ఫోన్‌ను పాంటోన్ గ్రిసెల్లే, పాంటోన్ లాట్టే, పాంటోన్ నాటికల్ బ్లూ మరియు పాంటోన్ పోయిన్సియానా అనే నాలుగు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Motorola Edge 50 Neo Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో 6.4 అంగుళాల LTPO P-OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ 3000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ అందించారు. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంది. ఇది Android 14 ఆధారిత సాఫ్ట్‌వేర్ స్కిన్ అందుబాటులో ఉంది. ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌‌తో వస్తుంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఫోన్ వెనుక ప్యానెల్‌లో 50MP ప్రైమరీ, 10MP టెలిఫోటో, 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. దీని 4310mAh బ్యాటరీ 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది.

Tags:    

Similar News