Golden Hour: సైబర్ దాడులపై అలర్ట్.. గోల్డెన్ అవర్స్ గురించి తెలిస్తే మీ డబ్బులు వెనక్కి..!
Golden Hour: నేటి రోజుల్లో సైబర్ దాడులు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ దాడులు నేడు పట్టణాలు, గ్రామాలకు విస్తరించాయి.
Golden Hour: నేటి రోజుల్లో సైబర్ దాడులు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ దాడులు నేడు పట్టణాలు, గ్రామాలకు విస్తరించాయి. పెరిగిన టెక్నాలజీ ఆసరగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు సులువుగా అకౌంట్‌లోని డబ్బులను మాయం చేస్తున్నారు. అందుకే తెలియని ఫోన్‌కాల్స్, మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్‌పై అలర్ట్ గా ఉండాలి. అనవసరమైన లింక్‌లు ఓపెన్ చేయవద్దు. ఎవరి మాటలు నమ్మి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు సైబర్ దాడికి గురైనట్లయితే వెంటనే గోల్డెన్ అవర్ గురించి తెలుసుకోండి.
హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సగటున సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొల్లగొడుతున్నారని తెలుస్తోంది. 2023లో సైబర్ నేరాల వల్ల 140 కోట్ల వరకు నష్టపోగా 44 కోట్లు ఫ్రీజ్ చేశామని, ఇందులో కేవలం 2 కోట్లలోపే తిరిగి బాధితులకు అందజేయగలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాగా చదువుకున్న వారే అత్యాశతో సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే తాము మోసపోతున్నామని గ్రహించిన 2 గంటల్లోపు (గోల్డెన్ అవర్స్) 1930కు కాల్ చేసి సాయం పొందాలని పోలీసులు సూచిస్తున్నారు.
సైబర్ క్రైమ్‌లో మొదటి రెండు గంటల వ్యవధి చాలా ముఖ్యమంటున్నారు. నేరస్థుడి ఖాతాను స్తంభింపజేసి డబ్బు రికవరీ చేసేందుకు ఈ 'గోల్డెన్ అవర్'ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ట్రేడింగ్, కొరియర్‌స్ పేరిట ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగాయి. పోలీసుల పేరిట ఫోన్లు చేసి, డీప్ ఫేక్ వంటి ఆర్టిఫిషియ్ ఇంటిలిజెన్స్‌ను టెక్నాలజీ ఉపయోగించి వీడియో కాల్స్‌లో యూనిఫామ్‌లో కనిపించి బురిడీ కొట్టిస్తున్నట్లు తెలుస్తోంది.