Jio Diwali Dhamaka Offer: అంబానీ దీపావళి గిఫ్ట్.. ఏడాది పాటు ఫ్రీ ఇంటర్నెట్..!
Jio Diwali Dhamaka Offer: అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి దీపావళి. ఈ సందర్భంగా కంపెనీలు అనేక ప్రత్యేక ఆఫర్‌లు అందిస్తున్నాయి.
Jio Diwali Dhamaka Offer: అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి దీపావళి. ఈ సందర్భంగా కంపెనీలు అనేక ప్రత్యేక ఆఫర్‌లు అందిస్తున్నాయి. తమ కస్టమర్లకు ప్రత్యేక బహుమతులు కూడా ఇస్తున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ జియో కూడా తన కస్టమర్లకు ప్రత్యేక బహుమతిని అందించింది. పండుగ సీజన్ డీల్స్ కింద జియో ఏ ప్రత్యేకతను అందిస్తుందో తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌ని అనుభవాన్ని ఆస్వాదించడానికి జియో ప్రత్యేక దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు రోజువారీ డేటాను ఆస్వాదించగలరు. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయచ్చు.
జియో దీపావళి ఆఫర్ కింద వినియోగదారులు ఒక సంవత్సరం పాటు ఫ్రీ ఇంటర్నెట్‌ని పొందుతారు. అయితే ఈ ఆఫర్ కోసం వినియోగదారులు రూ.20 వేల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో దీపావళి ఆఫర్‌లో కస్టమర్‌లు మై స్టోర్ నుండి రూ. 20,000 షాపింగ్ చేస్తే వారికి 1 సంవత్సరం పాటు ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.
జియో ప్రకారం కస్టమర్‌లు 1 సంవత్సరం పాటు ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ పొందేందుకు నవంబర్ 3లోపు My Store నుండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి షాపింగ్ చేయడం ద్వారా మీరు జియో ఇంటర్నెట్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా వినియోగించవచ్చు.
జియో దీపావళి ధమాకా ఆఫర్ కింద ఎయిర్ ఫైబర్ ప్లాన్ కూడా అందించబోతుంది. వినియోగదారులకు ఎలాంటి ఇతర ఛార్జీలు లేకుండా 3 నెలల పాటు ప్యాకేజీ అందిస్తుంది. అంతేకాకుండా కొత్త కస్టమర్లకు కూడా ఫ్రీ ఇంటర్నెట్ ఆఫర్ చేయనున్నారు.