Mac Mini: యాపిల్ నుంచి సూపర్ స్పీడ్‌తో పని చేసే మినీ డెస్క్‌టాప్ కంప్యూటర్ వచ్చేసింది
Apple launches new Mac Mini: కొత్త మ్యాక్ మినీని రిలీజ్ చేసింది యాపిల్. M4, M4 ప్రో చిప్స్‌తో తయారైన మ్యాక్ మినీ సైజు కేవలం 5 అంగుళాలు. చూడ్డానికి చిన్నది, కానీ పనిలో ఇది చాలా గట్టిది. యాపిల్ చెప్పిన ప్రకారం ఇందులోని లేటెస్ట్ చిప్స్ మూలంగా ఇది 1.8 – 2.2 రెట్లు వేగంగా పని చేస్తుంది. పాత M1 మాడల్‌తో పోల్చి చూస్తే దీని జీపీయూ పర్ఫార్మెన్స్ సుపీరియర్‌గా ఉంటుంది. తక్కువ స్పేస్‌లో ఎక్కువ వేగంగా పని చేసే డెస్క్ టాప్ కావాలనుకునే వారికి ఈ లేటెస్ట్ మ్యాక్ మినీ మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.
ఎప్పుడు.. ఎక్కడ... ఎంత?
M4, M4 ప్రో మ్యాక్ మినీ అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఎవరైనా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. మ్యాక్ మినీ M4 ధర రూ. 59,900 నుంచి మొదలవుతుంది. M4 ప్రో ప్రారంభ ధర రూ. 1,49,000. యూఎస్‌బీ-సి యాక్సెసరీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మ్యాక్ మినీతో పని చేసేందుకు మ్యాజిక్ కీబోర్డును రూ. 9,500లకు కొనుక్కోవచ్చు. దానికి టచ్ ఐడీ ఉండాలంటే రూ. 14,500 చెల్లించాలి. అలాగే, మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ రూ. 12,500, మ్యాజిక్ మౌజ్ రూ. 7,500, థండర్ బోల్డ్ 5 ప్రో కేబుల్ రూ. 6,900లకు కొనుక్కోవచ్చు.
మ్యాక్ మినీ స్పెసిఫికేషన్స్:
M4 మ్యాక్ మినీ 10-కోర్ సీపీయూ, 10-కోర్ జీపీయూతో వస్తుంది. 16 GB మెమరీతో మొదలవుతుంది.
M4 ప్రో అయితే 14-కోర్స్ వరకూ అందుబాటులో ఉంది. ఇది మల్టీథ్రెడెడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఎం4 ప్రో జీపీయూ అయితే దీనికి రెట్టింపు వేగంతో పని చేస్తుంది.
ఈ లేటెస్ట్ మ్యాక్ మినీకి యాక్సెస్ డ్రైవ్స్ కూడా ముందూ, వెనుకా ఉన్నాయి. యూఎస్‌బీ-సీ పోర్ట్స్, ఆడియో జాక్స్ కూడా ఉండడంతో వీటి ఉపయోగం మరింత మెరుగ్గా మారింది.
అంతేకాకుండా, యాపిల్ సిలికాన్ ఫీచర్ ఉన్న మిగతా మ్యాక్ డివైసెస్ లాగా ఈ మ్యాక్ మినీ కూడా యాపిల్ ఇంటలిజెన్స్ ఫీచర్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది తొలి కార్బన్-న్యూట్రల్ మాడల్ అని, దీనివల్ల 80 శాతం కాలుష్యం తగ్గుతుందని యాపిల్ ప్రకటించింది.