Upcoming Smartphones: కొత్త సంవత్సరం వస్తుంది.. కొత్త ఫోన్లు వస్తున్నాయ్
Upcoming Smartphones in 2025 January: మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కొత్త సంవత్సరంలో చాలా ఫోన్‌లు లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. జనవరిలో విడుదల చేయబోయే స్మార్ట్‌ఫోన్స్ జాబితాను ఇక్కడ సిద్ధం చేశాం.
Upcoming Smartphones in 2025 January: మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కొత్త సంవత్సరంలో చాలా ఫోన్‌లు లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. జనవరిలో విడుదల చేయబోయే స్మార్ట్‌ఫోన్స్ జాబితాను ఇక్కడ సిద్ధం చేశాం. జాబితాలో రెడ్‌మి, ఐటెల్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. మీరు కూడా కొత్త సంవత్సరంలో ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ లిస్ట్ చూడండి.
వన్‌ప్లస్ 13 సిరీస్
వన్‌ప్లస్ జనవరి 7న భారత్‌తో పాటు ఇతర ప్రపంచ మార్కెట్లలో OnePlus 13 సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో OnePlus 13 , OnePlus 13R అనే రెండు స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు ఉంటాయి. రెండు ఫోన్‌ల మైక్రోసైట్ అమెజాన్‌లో లైవ్ అవుతుంది. లిస్టింగ్ ఫోన్ కలర్ ఆప్షన్లు, స్పెషల్ ఫీచర్లు కూడా వెల్లడించింది. OnePlus 13 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. అయితే 13R స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో వస్తోంది. రెండు ఫోన్‌లు వన్‌ప్లస్ AI సపోర్ట్‌తో పాటు భారీగా AI ఫీచర్లను అందిస్తాయి.
వన్‌ప్లస్ 13 భారతదేశంలో ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుంది. వన్‌ప్లస్ 13R ఆస్ట్రల్ ట్రైల్,నెబ్యులా నోయిర్ షేడ్స్‌లో వస్తుంది. రెండింటిలోనూ 6000mAh బ్యాటరీ ఉంటుంది. వన్‌ప్లస్ 13 కూడా IP68, IP69 రేటింగ్‌లను డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. భారతదేశంలో వన్‌ప్లస్ 13 ధర రూ. 67,000 నుండి రూ. 70,000 మధ్య ఉండవచ్చని చెబుతున్నారు. వన్‌ప్లస్ 13R ఒకే RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో (12GB+256GB) వస్తుందని భావిస్తున్నారు. OnePlus 13R ధర శ్రేణి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
రెడ్‌మి 14C 5G
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ జనవరి 6న ఇండియాతో పాటు ఇతర ప్రపంచ మార్కెట్‌లలో లాంచ్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫోన్ సేల్ లైవ్ అవుతుంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో మధ్యలో పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఆ కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది.
ఇది Redmi 14R 5G రీబ్యాడ్జ్డ్ వెర్షన్ కావచ్చని చెబుతున్నారు. ఇది 14R రీబ్యాడ్జ్డ్ వెర్షన్ అయితే, Redmi 14C 5G స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్, 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీతో లాంచ్ కావచ్చు. ఇది 6.68-అంగుళాల 120Hz HD ప్లస్ LCD స్క్రీన్, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ఓఎస్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ బ్లాక్, బ్లూ, పర్పుల్ షేడ్స్‌లో వస్తుంది.
ఐటెల్ జెనో 10
ఐటెల్ భారతదేశంలో జెనో 10 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఫోన్ జనవరి 2025లో విడుదలవుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ సేల్ అమెజాన్‌లో లైవ్ అవుతుంది. ఫోన్ ప్రారంభ ధర రూ. 5,XXX ఉంటుంది. దీని నుండి ఫోన్ ప్రారంభ ధర రూ. 6,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేయచ్చు. ఫోన్ జెనితాల్ డిజైన్‌తో వస్తుందని మైక్రోసైట్ వెల్లడించింది. బ్లాక్, రెడ్, వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న లిస్టింగ్‌లో ఫోన్ డిజైన్ కూడా టీజ్ చేశారు.
స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రెండు కెమెరాలతో LED సెటప్ ఉంటుంది. ఫోన్‌లో వాటర్‌డ్రాప్ నాచ్‌తో పాటు ఐఫోన్ డైనమిక్ ఐలాండ్‌కు సమానమైన నాచ్ ఉంటుంది. ఈ Gen Z- ఫోకస్డ్ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని చెబుతున్నారు.
ఐటెల్ A80
ఐటెల్ కంపెనీ A80 స్మార్ట్‌ఫోన్‌ను జనవరిలో విడుదల చేయనుంది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఐటెల్ A80 పోన్‌ను టీజ్ చేసింది. మార్కెట్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఫోన్ రూ. 8,000 ధరల శ్రేణిలో లాంచ్ చేయచ్చు. ఫోన్‌లో 50MP ప్రధాన వెనుక కెమెరా ఉంటుంది. ఫోన్ దుమ్ము, నీటి నుండి సురక్షితంగా ఉండటానికి IP54 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 4GB వర్చువల్ ర్యామ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.