iPhone 16 Tricks: ఈ 7 ట్రిక్స్ తెలిస్తే ఐఫోన్-16 ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది...
యాపిల్ ఐఫోన్16 మార్కెట్లోకి వచ్చి సందడి చేస్తోంది. ఈ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్‌లో చాలా స్పెషాలిటిస్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మొబైల్ ఎక్స్‌పీరియన్స్ మరో లెవెల్లో ఉంటుంది. అందుకోసం, ఈ 7 ట్రిక్స్ తెలుసుకోండి.
1. కేబుల్ ట్రాన్స్‌ఫర్: పాత మాడల్స్ పోల్చితే ఈ ఫోన్లో కేబుల్ ట్రాన్స్‌ఫర్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. నిజానికి, ఇది iOS 18 రహస్య ఫీచర్. ఐఫోన్ 15 నుంచి 16 కు డేటా మార్చితే థండర్‌బోల్ట్ కేబుల్ ట్రాన్స్‌ఫర్ చాలా వేగంగా పూర్తవుతుంది. పాత మాడల్స్‌కు చెందిన లైటెనింగ్ కేబుల్‌తో కూడా 16 మాడల్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ పెరిగింది. అంతేకాదు, 16లో వైఫై ట్రాన్స్‌ఫర్ స్పీడ్ కూడా పెరిగింది.
2. షార్ట్‌కట్ యాక్షన్ బటన్: మ్యూట్ స్విచ్‌కు బదులు ఐఫోన్ 16లో యాక్షన్ బటన్ ఉంది. ఈ బటన్‌కు మీకు కావలసిన ఫీచర్‌కు షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకు, డౌన్లోడ్ చేసుకున్న పాటలను షఫిల్ చేసుకోవడానికి ఈ బటన్‌తో షార్ట్ కట్ సెట్ చేసుకోవచ్చు.
3. థర్డ్ పార్టీ కెమేరా యాప్ ఓపెన్ చేయొచ్చు: ఐఫోన్ 16లోని కొత్త కెమేరా కంట్రోల్‌తో ఫోన్లోని ఇన్‌స్టాగ్రామ్ వంటి థర్డ్ పార్టీ కెమేరాను ఓపెన చేయొచ్చు. అందుకోసం, సెటింగ్స్‌లోకి వెళ్ళి థర్డ్ పార్టీ ఫోన్ యాక్టివేట్ చేసుకోవాలి.
4. డబుల్ క్లిక్ కెమేరా కంట్రోల్: సింగిల్ టాప్‌తో కెమేరా ఓపెన్ కావడం ఇబ్బందిగా ఉందని యూజర్స్ నుంచి కంప్లయింట్స్ రావడంతో ఈసారి ఐఫోన్‌లో కెమేరా ఓపెన్ చేయడానికి డబుల్ టాపింగ్ ఫీచర్ యాడ్ చేశారు. దీనివల్ల, పొరపాటున కెమేరా ఆన్ కావడమనే సమస్య ఇక ఉండదు.
5. కొత్త ఫోటోగ్రాఫిక్ స్టయిల్స్: లేటెస్ట్ ఐఫోన్‌లో ఫోటోగ్రాఫిక్ స్టయిల్స్ అన్నీ మారిపోయాయి. వీటి ద్వారా మరింత క్వాలిటీ ఫోటోలు తీసుకోవడానికి షూటింగ్ ఫార్మాట్‌ను HEIF కు మార్చుకోవాలి. JPEG కన్నా ఇది మెరుగ్గా ఉంటుంది. ఫోటో ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తుంది. తద్వారా ఫోటోగ్రాఫిక్ స్టయిల్స్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.
6. సినిమాటిక్ స్లో-మో షాట్స్: సెకనుకు 120 ఫ్రేమ్స్‌తో (120fps) 4K క్వాలిటీ వీడియో స్లోమోషన్ వీడియో తీసుకోవడం ఐఫోన్ 16తో సాధ్యమవుతుంది. ఇది నిజానికి కిల్లింగ్ ఫీచర్. సినిమాటిక్ స్లోమోషన్ షాట్స్‌తో రీల్స్ చేస్తే అదిరిపోతుంది. సెటింగ్స్‌లోకి వెళ్ళి కెమేరా టాబ్ ఓపెన్ చేసి క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని స్లోమోషన్ షాట్స్ సింపుల్‌గా తీసుకోవచ్చు.
7. మాక్రో మోడ్ కంట్రోల్: ఐఫోన్‌లో మాక్రో మోడ్ కంట్రోల్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అల్ట్రా వైడ్ ఫోటోలు తీయాలనుకున్నప్పుడు మాక్రో మోడ్ ఆన్ అవుతుంది. ఇది ఒక్కోసారి గందరగోళంగా ఉంటుంది. కొత్త ఫోన్‌లో మాక్రో మోడ్ ఆన్ అవగానే, స్క్రీన్ మీద ఐకాన్ కనిపిస్తుంది. మాక్రో మోడ్ వద్దనుకుంటే ఆ కంట్రోల్ టచ్ చేసి, టాగిల్ ఆఫ్ చేసుకోవచ్చు.
ఇవీ ఐఫోన్ 16 మెరుగ్గా వాడుకోవడానికి మీకు ఉపయోగపడే 7 ట్రిక్స్. ఇలాంటి మరికొన్ని ట్రిక్స్, టిప్స్ కోసం హెచ్ఎంటీవీ టెక్నాలజీ పేజీని చూస్తూ ఉండండి.