Internet Speed Tips: ఫోన్‌లో ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదా.. ఈ ట్రిక్స్ పాటిస్తే సూపర్ వేగం..!

Internet Speed Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. కానీ అందరు కామన్‌గా ఎదుర్కొనే సమస్య ఇంటర్నెట్‌ సరిగ్గా రాకపోవడం.

Update: 2023-08-25 13:30 GMT

Internet Speed Tips: ఫోన్‌లో ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదా.. ఈ ట్రిక్స్ పాటిస్తే సూపర్ వేగం..!

Internet Speed Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. కానీ అందరు కామన్‌గా ఎదుర్కొనే సమస్య ఇంటర్నెట్‌ సరిగ్గా రాకపోవడం. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బ్రౌజింగ్ సరిగ్గా చేయలేము. UPI పేమెంట్స్ చేసుకోవడం కష్టమవుతుంది. అత్యవసర ఈ-మెయిల్, మెసేజ్ పంపడం కుదరదు. ఇలాంటి ముఖ్యమైన పనులకు అంతరాయం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఇంటర్నెట్‌ స్పీడ్‌ని ఎలా పెంచుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

మొబైల్ డేటా సరిగ్గా రాకపోతే చేయవలసిన మొదటి పని మొబైల్ డేటాను ఆఫ్ చేసి ఆపై మళ్లీ ఆన్ చేయాలి. ఇది నెట్‌వర్క్ కనెక్షన్‌ని రీసెట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఎయిర్‌ ప్లేన్ మోడ్‌ని ఆన్ ఆఫ్ చేయాలి. ఇది నెట్‌వర్క్ కనెక్షన్‌ని మెరుగుపరుస్తుంది. కొన్నిసార్లు మొబైల్‌ ఆఫ్ చేయడం ఆన్ చేయడం వల్ల నెట్‌వర్క్ సమస్యని పరిష్కరించవచ్చు. ఇంకా కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్‌ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను చెక్‌ చేయాలి. అన్ని సెట్టింగ్‌లు సరిగ్గా ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి. కొన్నిసార్లు SIM కార్డ్‌లో ఉండే చిన్న సమస్యలు నెట్‌వర్క్ కనెక్షన్‌ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి SIM కార్డ్‌ని చెక్‌ చేసి అవసరమైతే శుభ్రం చేసి మళ్లీ ఇన్‌సర్ట్ చేయాలి.

అలాగే మొబైల్ ఇంటర్నెట్‌ని స్పీడ్ చేసే కొన్ని ఇతర టిప్స్ కూడా ఉన్నాయి. Cache, Cookies క్లియర్ చేయాలి. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్‌గా వస్తుంది. ఒకేసారి చాలా యాప్‌లను రన్ అవడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి. ఆటోమేటిక్ అప్‌డేట్‌లు చాలా డేటాను వినియోగిస్తాయి. దీని వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. అందుకే ఆటో-అప్‌డేట్‌లను నిలిపివేయాలి.

Tags:    

Similar News